Title (Indic)కావఁగ (క ) నీకే పోదు కరుణానిధివి గాన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కావఁగ (క ) నీకే పోదు కరుణానిధివి గాన దేవ నీ బంట్లము మా తెరువేఁటి తెరువు (॥కావఁ॥) బండుబండై వూరఁగల పనులెల్లాఁ జేసేము యెండాతా నీడౌతా నెఱఁగము కొండలరాయఁడ మమ్ముఁ గోరి పుట్టించఁగా నీవు బెండువంటి వారము మా బిగు వేఁటిబిగువు (॥కావఁ॥) దీనుఁడనై యాసలనే దిక్కులెల్లాఁ దిరిగేము కాని దెందో మంచి దెందో కానము శ్రీనాథ నీవు మాకు జీవమయి వుండఁగాను మానువంటి వారము మా మనసేటి మనసు (॥కావఁ॥) బొందితోడఁ బుట్టితిమి భోగించేమేమైనా యెందుకాతా నేడకౌతా నెఱఁగము యిందును శ్రీవేంకటేశ యిహముఁ బరము నీవే చెంది నీ దాసులము మా చేఁత యేఁటిచేఁత English(||pallavi||) kāvam̐ga (ka ) nīge podu karuṇānidhivi gāna deva nī baṁṭlamu mā tĕruvem̐ṭi tĕruvu (||kāvam̐||) baṁḍubaṁḍai vūram̐gala panulĕllām̐ jesemu yĕṁḍādā nīḍaudā nĕṟam̐gamu kŏṁḍalarāyam̐ḍa mammum̐ gori puṭṭiṁcham̐gā nīvu bĕṁḍuvaṁṭi vāramu mā bigu vem̐ṭibiguvu (||kāvam̐||) dīnum̐ḍanai yāsalane dikkulĕllām̐ dirigemu kāni dĕṁdo maṁchi dĕṁdo kānamu śhrīnātha nīvu māgu jīvamayi vuṁḍam̐gānu mānuvaṁṭi vāramu mā manaseḍi manasu (||kāvam̐||) bŏṁdidoḍam̐ buṭṭidimi bhogiṁchememainā yĕṁdugādā neḍagaudā nĕṟam̐gamu yiṁdunu śhrīveṁkaḍeśha yihamum̐ baramu nīve sĕṁdi nī dāsulamu mā sem̐ta yem̐ṭisem̐ta