Title (Indic)కాంత నీవుగల చోటు కలిమిగలుగు చోటు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాంత నీవుగల చోటు కలిమిగలుగు చోటు కాంతుని కితరమెల్లాఁ గడగడ చోటు (॥కాంత॥) సతి నీమోమెత్తుటే చంద్రోదయమౌట అతివ నీతలవంపు అస్తమానము మితి నీచూచినచూపే మించిన సూర్యోదయము రతి రెప్పమూయుటే యారవియస్తమానము (॥కాంత॥) పొలఁతి నీవు నవ్వుటే పున్నమపెనుఁబండుగ మలసి కోపించుటే యమాసదినము అలరి మాటాడినదే ఆమనికాలము నీవు వొలసీవొల్లమి నుండు టుడివోపుఁగాలము (॥కాంత॥) యింతి నీవు గూడుటే యెన్నిక విరహవేళ అంతో మైమఱచుటే యానందవేళ పంతపు శ్రీవేంకటాద్రిపతికి నీవిట్లనే మంతనాన నుండుటే మరుజన్మవేళ English(||pallavi||) kāṁta nīvugala soḍu kalimigalugu soḍu kāṁtuni kidaramĕllām̐ gaḍagaḍa soḍu (||kāṁta||) sadi nīmomĕttuḍe saṁdrodayamauḍa adiva nīdalavaṁpu astamānamu midi nīsūsinasūbe miṁchina sūryodayamu radi rĕppamūyuḍe yāraviyastamānamu (||kāṁta||) pŏlam̐ti nīvu navvuḍe punnamabĕnum̐baṁḍuga malasi kobiṁchuḍe yamāsadinamu alari māḍāḍinade āmanigālamu nīvu vŏlasīvŏllami nuṁḍu ṭuḍivobum̐gālamu (||kāṁta||) yiṁti nīvu gūḍuḍe yĕnniga virahaveḽa aṁto maimaṟasuḍe yānaṁdaveḽa paṁtabu śhrīveṁkaḍādribadigi nīviṭlane maṁtanāna nuṁḍuḍe marujanmaveḽa