Title (Indic)కాంత నీవు గూడఁగా నేఁగంటి నేల లోఁగేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాంత నీవు గూడఁగా నేఁగంటి నేల లోఁగేవు వింతగాఁ గంటికిఁ జూపు వేరయ్యీనా (॥కాంత॥) నీవు నాకుఁ జుట్టమవై నిలిచినాఁడవుగాన నీవద్దియింతులు నాకు నెమ్మిఁ జుట్టాలె పూవులుముడిచితేను పూవులలోవాసనలు వేవేలుచెప్పినాను వేరులయ్యీనా (॥కాంత॥) నీమనసు నామనసు నిక్కమూ నొక్కటె కాన కామించిన నీపనులు కా దన నేను దీమసాన సొమ్ములెల్ల దేహమున నించుకొంటె వేమరు వానికాంతులు వేరె వుండీనా (॥కాంత॥) యెప్పుడూ నీ నా ప్రాణా లేకమయ్యెవుండుఁగాన యిప్పటి నీజాడలెల్లా నితవె నాకు అప్పటి శ్రీవెంకటేశ ఆయమంటి కూడితివి విప్పరాని చనవులు వేరయ్యీనా English(||pallavi||) kāṁta nīvu gūḍam̐gā nem̐gaṁṭi nela lom̐gevu viṁtagām̐ gaṁṭigim̐ jūbu verayyīnā (||kāṁta||) nīvu nāgum̐ juṭṭamavai nilisinām̐ḍavugāna nīvaddiyiṁtulu nāgu nĕmmim̐ juṭṭālĕ pūvulumuḍisidenu pūvulalovāsanalu vevelusĕppinānu verulayyīnā (||kāṁta||) nīmanasu nāmanasu nikkamū nŏkkaḍĕ kāna kāmiṁchina nībanulu kā dana nenu dīmasāna sŏmmulĕlla dehamuna niṁchugŏṁṭĕ vemaru vānigāṁtulu verĕ vuṁḍīnā (||kāṁta||) yĕppuḍū nī nā prāṇā legamayyĕvuṁḍum̐gāna yippaḍi nījāḍalĕllā nidavĕ nāgu appaḍi śhrīvĕṁkaḍeśha āyamaṁṭi kūḍidivi vipparāni sanavulu verayyīnā