Title (Indic)కాఁగిటికి వచ్చి నీవు కలసినప్పుడుగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాఁగిటికి వచ్చి నీవు కలసినప్పుడుగాక మాఁగిన మోవి చూపఁగ మరి లాభమేమి (॥కాఁగి॥) జట్టిగొని నాతోను సరసములాడేవు వట్టి జోలి దవ్వఁగాను వచ్చేదేమి చుట్టి చుట్టి యప్పటిని చుట్టరికాలు చెప్పేవు బట్టబయ లందులో పనిగొనే దేమి (॥కాఁగి॥) నానఁబెట్టి నీవు నాతో నవ్వులెల్లా నవ్వఁగాను పూనిపట్టి ఇంతలోనే పొందేదేమి మానలేక పై పై యెడమాట లిట్టె యాడించఁగా కానిమ్మని ఇఁక మరి కట్టుకొనే దేమి (॥కాఁగి॥) తేరకొని నాదిక్కే దిష్టించి చూడఁగాను మేరమీరి నాపంతము మెరసేదేమి గారవించి నన్నేలితి గక్కన శ్రీ వేంకటేశ కోరికె చెల్లెను యింకాఁ గొసరేదేమి English(||pallavi||) kām̐giḍigi vachchi nīvu kalasinappuḍugāga mām̐gina movi sūbam̐ga mari lābhamemi (||kām̐gi||) jaṭṭigŏni nādonu sarasamulāḍevu vaṭṭi joli davvam̐gānu vachchedemi suṭṭi suṭṭi yappaḍini suṭṭarigālu sĕppevu baṭṭabaya laṁdulo panigŏne demi (||kām̐gi||) nānam̐bĕṭṭi nīvu nādo navvulĕllā navvam̐gānu pūnibaṭṭi iṁtalone pŏṁdedemi mānalega pai pai yĕḍamāḍa liṭṭĕ yāḍiṁcham̐gā kānimmani im̐ka mari kaṭṭugŏne demi (||kām̐gi||) teragŏni nādikke diṣhṭiṁchi sūḍam̐gānu meramīri nābaṁtamu mĕrasedemi gāraviṁchi nannelidi gakkana śhrī veṁkaḍeśha korigĕ sĕllĕnu yiṁkām̐ gŏsaredemi