Title (Indic)కాల(లి?)కడఁ దెగెఁ జెలియగర్వంపు దాలిములు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాల(లి?)కడఁ దెగెఁ జెలియగర్వంపు దాలిములు కాలగతి యిఁకనెంత గాఁగలదొ మీఁద (॥కాల॥) బలుపుఁ దురుమరజాతి పగలుచీఁకట్లాయె పొలయుఁగన్నీట నిప్పులు గురిసెను చలితాపమున శశియు సవితుండుఁ గవఁబొడచె ఇల మదనదైవికం బెటుగాఁ గలదొ (॥కాల॥) చెడుగు నిట్టూరుపుల చిచ్చు గాలియుఁ గూడె వెడగుఁ జెమటల జలధి వెల్లివిరిసె కడుఁబులకలనె శిథిలి కన్నచోటనె పొడమె సుడిసి చెలిసిగ్గెట్ల చూరఁబోఁగలదో (॥కాల॥) భామకుచముల మీఁదఁ బ్రతిచందురులు వొడచె చీమ దొంతర లతలఁ జిగిరించెను వామాక్షి వేంకటేశ్వరుకౌఁగిటను గలసె ప్రేమమిఁక నిదియెంత పెద్దగాఁగలదో English(||pallavi||) kāla(li?)kaḍam̐ dĕgĕm̐ jĕliyagarvaṁpu dālimulu kālagadi yim̐kanĕṁta gām̐galadŏ mīm̐da (||kāla||) balubum̐ durumarajādi pagalusīm̐kaṭlāyĕ pŏlayum̐gannīḍa nippulu gurisĕnu salidābamuna śhaśhiyu saviduṁḍum̐ gavam̐bŏḍasĕ ila madanadaivigaṁ bĕḍugām̐ galadŏ (||kāla||) sĕḍugu niṭṭūrubula sichchu gāliyum̐ gūḍĕ vĕḍagum̐ jĕmaḍala jaladhi vĕllivirisĕ kaḍum̐bulagalanĕ śhithili kannasoḍanĕ pŏḍamĕ suḍisi sĕlisiggĕṭla sūram̐bom̐galado (||kāla||) bhāmagusamula mīm̐dam̐ bradisaṁdurulu vŏḍasĕ sīma dŏṁtara ladalam̐ jigiriṁchĕnu vāmākṣhi veṁkaḍeśhvarugaum̐giḍanu galasĕ premamim̐ka nidiyĕṁta pĕddagām̐galado