Title (Indic)కాలాంతకుఁడను వేఁటకాఁ డెప్పుడుఁ దిరిగాడును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాలాంతకుఁడను వేఁటకాఁ డెప్పుడుఁ దిరిగాడును కాలంబనియెడి తీవ్రపుగాలి వెర వెఱిఁగి (॥కాలాం॥) పరమపదంబు చేనికి పసిగొనునర మృగములకు నును తరమిడి, సంసారపుటోఁదములనె యాఁగించి, వురవడిఁ జేసినకర్మపుటరులు దరిద్రంబనువల వొరపుగ మాయనుపోగులు వొకవెరవున వేసీ (॥కాలాం॥) కదుముకవచ్చేటిబలురోగపుఁగుక్కల నుసికొలిపి, వదలక ముదిసినముదిమే వాకట్టుగఁ గట్టి. పొదలుచు మృత్యువు పందివోటై నల్లెట నాడఁగ. పదిలముగా గింకరులనుచొప్పరులఁ బరవిడిచీ (॥కాలాం॥) ఆవోఁదంబులఁ జిక్కక, ఆవురులనుఁ దెగనురికి, ఆవేఁటకాండ్ల నదలించాచేనే చొచ్చి, పావనమతిఁ బొరెవొడిచి పరమానందముఁ బొందుచు శ్రీ వేంకటపతి మనమునఁ జింతించీ నరమృగము English(||pallavi||) kālāṁtagum̐ḍanu vem̐ṭagām̐ ḍĕppuḍum̐ dirigāḍunu kālaṁbaniyĕḍi tīvrabugāli vĕra vĕṟim̐gi (||kālāṁ||) paramabadaṁbu senigi pasigŏnunara mṛgamulagu nunu taramiḍi, saṁsārabuḍom̐damulanĕ yām̐giṁchi, vuravaḍim̐ jesinagarmabuḍarulu daridraṁbanuvala vŏrabuga māyanubogulu vŏgavĕravuna vesī (||kālāṁ||) kadumugavachcheḍibalurogabum̐gukkala nusigŏlibi, vadalaga mudisinamudime vāgaṭṭugam̐ gaṭṭi. pŏdalusu mṛtyuvu paṁdivoḍai nallĕḍa nāḍam̐ga. padilamugā giṁkarulanusŏpparulam̐ baraviḍisī (||kālāṁ||) āvom̐daṁbulam̐ jikkaga, āvurulanum̐ dĕganurigi, āvem̐ṭagāṁḍla nadaliṁchāsene sŏchchi, pāvanamadim̐ bŏrĕvŏḍisi paramānaṁdamum̐ bŏṁdusu śhrī veṁkaḍabadi manamunam̐ jiṁtiṁchī naramṛgamu