Title (Indic)కాకున్న నింత లోఁగేవా గడుసరివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాకున్న నింత లోఁగేవా గడుసరివి కేకలు వెట్టి నవ్వితేఁ గిందువడే విపుడు (॥॥) పక్కన మాటాడితే నీపైకి తీసుకొనేవు చక్క దిష్టించి చూచితే జడిసేవు మొక్కితేనే వెంగెమంటా మొగము వంచుకొనేవు నిక్కి యెందై నా నీవు నేరమి చేసితివో (॥॥) పేరుకొని పిలిచితే బ్రియములు చెప్పేవు చేరి చేత నివిరితే సిగ్గువడేవు అరసి కొంగు వట్టితే నానలు వెట్టుకొనేవు దార దప్పి యెందైనా నిందలకు లోనైతివో (॥॥) మెచ్చి కాఁగిలించుకొంటే మేనెల్లాఁ జెమరించేవు పచ్చి రతులఁ గూడితే బ్రమసేవు అచ్చపు శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను విచ్చినవిడి నెందైనా వెల్లవిరులైతివో English(||pallavi||) kāgunna niṁta lom̐gevā gaḍusarivi kegalu vĕṭṭi navvidem̐ giṁduvaḍe vibuḍu (||||) pakkana māḍāḍide nībaigi tīsugŏnevu sakka diṣhṭiṁchi sūside jaḍisevu mŏkkidene vĕṁgĕmaṁṭā mŏgamu vaṁchugŏnevu nikki yĕṁdai nā nīvu nerami sesidivo (||||) perugŏni piliside briyamulu sĕppevu seri seda niviride sigguvaḍevu arasi kŏṁgu vaṭṭide nānalu vĕṭṭugŏnevu dāra dappi yĕṁdainā niṁdalagu lonaidivo (||||) mĕchchi kām̐giliṁchugŏṁṭe menĕllām̐ jĕmariṁchevu pachchi radulam̐ gūḍide bramasevu achchabu śhrīveṁkaḍeśha alamelumaṁga nenu vichchinaviḍi nĕṁdainā vĕllavirulaidivo