Title (Indic)కాకున నేఁ బొరలితి కాతరాన బడలితి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాకున నేఁ బొరలితి కాతరాన బడలితి నీకు మొక్కే నాకు బుద్ది నేరుపఁగఁ గలవా (॥॥) అడ్డమాడఁ జాలను అవుఁగాదనఁ జాలను దొడ్డదొరవు నీమాట తోయఁ జాలను వెడ్డువెట్టి తొల్లి నీవే వేసాలు నేర్పితివి యెడ్డతన మిఁక నాకు నెట్టు మానిపేవు (॥॥) మనసులోదానను మచ్చికైన దానను ఘనుఁడవు నీతో నేను గయ్యాళించను చనవిచ్చి అన్నింటాను చవులుమరపితివి యెనలేక నన్ను నెట్టు యీడేర్చేవో (॥॥) వేవేలకు దూర నేను వేడుక చెల్లింతు నేను శ్రీ వేంకటేశుఁడవు చెలఁగింతును వావులు దెలిపి నాఁడే వలపులు చల్లితివి కైవసమై నన్ను నెట్టు గరుణించేవో English(||pallavi||) kāguna nem̐ bŏralidi kādarāna baḍalidi nīgu mŏkke nāgu buddi nerubam̐gam̐ galavā (||||) aḍḍamāḍam̐ jālanu avum̐gādanam̐ jālanu dŏḍḍadŏravu nīmāḍa toyam̐ jālanu vĕḍḍuvĕṭṭi tŏlli nīve vesālu nerbidivi yĕḍḍadana mim̐ka nāgu nĕṭṭu mānibevu (||||) manasulodānanu machchigaina dānanu ghanum̐ḍavu nīdo nenu gayyāḽiṁchanu sanavichchi anniṁṭānu savulumarabidivi yĕnalega nannu nĕṭṭu yīḍersevo (||||) vevelagu dūra nenu veḍuga sĕlliṁtu nenu śhrī veṁkaḍeśhum̐ḍavu sĕlam̐giṁtunu vāvulu dĕlibi nām̐ḍe valabulu sallidivi kaivasamai nannu nĕṭṭu garuṇiṁchevo