Title (Indic)కాకుంటే యీ శూన్యవాద కఠినచిత్తుల చేత WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాకుంటే యీ శూన్యవాద కఠినచిత్తుల చేత పైకొని వివేకులకు బ్రదుకఁగ వచ్చునా (॥కాకుం॥) అల్లనాఁడు నిరాకార మనెడి మాటలచేత వెల్లిఁబోయ లోకములో విజ్ఞానమెల్లా కల్లని మీ త్రివిక్రమాకారము చూపి మీరు చెల్లఁ బెట్టితిరి వేదశిఖలందు మరియు (॥కాకుం॥) ఆలకించి యహంబ్రహ్మ మనెడి బుద్ధుల చేత గాలిఁ బోయ భక్తి యల్లా కాలమందే యేలి ప్రహ్లాదునికిఁగా హిరణ్యకశిపు నొద్ద యేలికబంటువరుస లిందె చూపితిరి (॥కాకుం॥) అంతా నొక్కటియనే అధర్మవిధులచేత గుంతఁబడెఁ బుణ్యమెల్లాఁ గొల్లఁబోయి ఇంతట శ్రీవేంకటేశ యెక్కుడు నేనని కొండ వింతగాఁగఁ బొడవెక్కి విఱ్ఱవీఁగితివి English(||pallavi||) kāguṁṭe yī śhūnyavāda kaṭhinasittula seda paigŏni vivegulagu bradugam̐ga vachchunā (||kāguṁ||) allanām̐ḍu nirāgāra manĕḍi māḍalaseda vĕllim̐boya logamulo vijñānamĕllā kallani mī trivikramāgāramu sūbi mīru sĕllam̐ bĕṭṭidiri vedaśhikhalaṁdu mariyu (||kāguṁ||) ālagiṁchi yahaṁbrahma manĕḍi buddhula seda gālim̐ boya bhakti yallā kālamaṁde yeli prahlādunigim̐gā hiraṇyagaśhibu nŏdda yeligabaṁṭuvarusa liṁdĕ sūbidiri (||kāguṁ||) aṁtā nŏkkaḍiyane adharmavidhulaseda guṁtam̐baḍĕm̐ buṇyamĕllām̐ gŏllam̐boyi iṁtaḍa śhrīveṁkaḍeśha yĕkkuḍu nenani kŏṁḍa viṁtagām̐gam̐ bŏḍavĕkki viṭravīm̐gidivi