Title (Indic)కాకుండితే రమణుఁడ కాఁతాళములు రేఁగు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాకుండితే రమణుఁడ కాఁతాళములు రేఁగు పైకొన్నమాటతోడ పంతమెల్లా దక్కెను (॥కాకుం॥) వుల్లసముగా నాడినవొడ్డారపునీమాట చల్లనినవ్వుమాటతో శాంతమాయను కల్లలుగా నాడినకారపువెంగెపుమాట తెల్లమై ఆసమాటతో తియ్యనాయను (॥కాకుం॥) వూరకె నీవాడిన వుప్పనైననీమాట సారపుముద్దుమాటతో చవి వుట్టెను జారువడ నాడినట్టిచప్పనైననీమాట పేరుకొన్న మాటతోడఁ బ్రియమాయను (॥కాకుం॥) కప్పురపు వెసురుకాఁగిటిలో తిట్టుమాఁట వొప్పినసమ్మతి మాఁట నొచ్చెము దీరె యిప్పుడే శ్రీవేంకటేశ యెనసినపచ్చిమాఁట తప్పినినీమాఁటతోడ తనివి నాకాయను English(||pallavi||) kāguṁḍide ramaṇum̐ḍa kām̐tāḽamulu rem̐gu paigŏnnamāḍadoḍa paṁtamĕllā dakkĕnu (||kāguṁ||) vullasamugā nāḍinavŏḍḍārabunīmāḍa sallaninavvumāḍado śhāṁtamāyanu kallalugā nāḍinagārabuvĕṁgĕbumāḍa tĕllamai āsamāḍado tiyyanāyanu (||kāguṁ||) vūragĕ nīvāḍina vuppanainanīmāḍa sārabumuddumāḍado savi vuṭṭĕnu jāruvaḍa nāḍinaṭṭisappanainanīmāḍa perugŏnna māḍadoḍam̐ briyamāyanu (||kāguṁ||) kappurabu vĕsurugām̐giḍilo tiṭṭumām̐ṭa vŏppinasammadi mām̐ṭa nŏchchĕmu dīrĕ yippuḍe śhrīveṁkaḍeśha yĕnasinabachchimām̐ṭa tappininīmām̐ṭadoḍa tanivi nāgāyanu