Title (Indic)కాకిబెగడ శీరను కాశ వోసినాఁడు తాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాకిబెగడ శీరను కాశ వోసినాఁడు తాను వాకిటికి వచ్చినాఁడు వలశితి ననవే (॥కాకి॥) పచ్చనిసాపమీఁదఁ బవళించు మనవే కుచ్చి మాసూపులు దన్ను గురి దాఁకెను చెచ్చెరఁ బారుటాకుల చెంచవార మనవే తెచ్చేను మా దొండపంటితేనె లిదే అనవే (॥కాకి॥) కొండపడ మేడలలోఁ గూరుసుండు మనవే నిండునెమలిగరులు నెత్తి కెక్కెను దిండు మా వెలఁగపండ్లు తీపు లెక్కె ననవే అండనె వుందాన తన కప్పగించే ననవే (॥కాకి॥) కొప్పుల మొలల సే కుప్పవడె ననవే కప్పురపు తనతమ్మ కార మనవే వొప్పుగా శ్రీవెంకటేశుఁ డొనగూడె ననవే ముప్పిరి నేమీ నెఱఁగ మొక్కితి నే ననవే English(||pallavi||) kāgibĕgaḍa śhīranu kāśha vosinām̐ḍu tānu vāgiḍigi vachchinām̐ḍu valaśhidi nanave (||kāgi||) pachchanisābamīm̐dam̐ bavaḽiṁchu manave kuchchi māsūbulu dannu guri dām̐kĕnu sĕchchĕram̐ bāruḍāgula sĕṁchavāra manave tĕchchenu mā dŏṁḍabaṁṭidenĕ lide anave (||kāgi||) kŏṁḍabaḍa meḍalalom̐ gūrusuṁḍu manave niṁḍunĕmaligarulu nĕtti kĕkkĕnu diṁḍu mā vĕlam̐gabaṁḍlu tību lĕkkĕ nanave aṁḍanĕ vuṁdāna tana kappagiṁche nanave (||kāgi||) kŏppula mŏlala se kuppavaḍĕ nanave kappurabu tanadamma kāra manave vŏppugā śhrīvĕṁkaḍeśhum̐ ḍŏnagūḍĕ nanave muppiri nemī nĕṟam̐ga mŏkkidi ne nanave