Title (Indic)కాదు వివేకము యిది కాదు యవివేకము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదు వివేకము యిది కాదు యవివేకము సోదించి నీకు శరణు చొరవలెఁ గాని (॥కాదు॥) కందువఁ దొల్లిటి జన్మకథ యేమి నెఱుఁగఁడు ముందరిజన్మమునకు ముంచి పుణ్యము సేసును యిందేమి గనెనో దేహి యెవ్వరి నమ్మెనో తాను సందడి భోగములలో సాములు సేసీని (॥కాదు॥) గరిమ భూమండలము కడపల గానఁడు పరము గావలెనని పాట్లఁబడి దేహి యిరవు దనకు నేదో యెఱిఁగిన యెఱుకేదో పరగిన యాసలకే పట్టి పెనఁగీని (॥కాదు॥) తగ నిదరించేవేళ తన స్వతంత్రము లేదు మిగులా నుద్యోగించు మేలుకొనేవేళ నిగిడి శ్రీవేంకటేశ నీ వంతరాత్మ వనక వెగటుఁ జదువులలో వెదకఁ జూచీని English(||pallavi||) kādu vivegamu yidi kādu yavivegamu sodiṁchi nīgu śharaṇu sŏravalĕm̐ gāni (||kādu||) kaṁduvam̐ dŏlliḍi janmagatha yemi nĕṟum̐gam̐ḍu muṁdarijanmamunagu muṁchi puṇyamu sesunu yiṁdemi ganĕno dehi yĕvvari nammĕno tānu saṁdaḍi bhogamulalo sāmulu sesīni (||kādu||) garima bhūmaṁḍalamu kaḍabala gānam̐ḍu paramu gāvalĕnani pāṭlam̐baḍi dehi yiravu danagu nedo yĕṟim̐gina yĕṟugedo paragina yāsalage paṭṭi pĕnam̐gīni (||kādu||) taga nidariṁcheveḽa tana svadaṁtramu ledu migulā nudyogiṁchu melugŏneveḽa nigiḍi śhrīveṁkaḍeśha nī vaṁtarātma vanaga vĕgaḍum̐ jaduvulalo vĕdagam̐ jūsīni