Title (Indic)కాదు గూడదననేల కక్కసించ నీతోనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదు గూడదననేల కక్కసించ నీతోనేల సేదదేర నేర్చినట్టు సేవ సేసేను (॥కాదు॥) ఆపెకు బుద్దులుచెప్పి అట్టెనాకు మొక్కించి యేపుననున్నాఁడ విట్టె యెరఁగనట్టే కోపగించుకొనరాదు కోరి నీతో నవ్వరాదు వోపినపనిసేసి వొద్దనుండే నేను (॥కాదు॥) కామినికి సన్నసేసి కానిక నాకిప్పించి యేమియని అడిగేవు యెరఁగనట్టే మోమోట విడువరాదున మొక్కలముసేయరాదు గోమున నీకొలువులో కుంచ వేసే నేను (॥కాదు॥) యింతిచే విడెమిప్పించి యెగ్గులెల్లాఁ దీర్చితివి యెంతకెంత సేసితివి యెరఁగనట్టే కాంతుఁడ శ్రీ వెంకటేశ కలసితివిటు నన్ను పంతానకు నీకునేఁడు పాదాలొత్తే నేను English(||pallavi||) kādu gūḍadananela kakkasiṁcha nīdonela sedadera nersinaṭṭu seva sesenu (||kādu||) ābĕgu buddulusĕppi aṭṭĕnāgu mŏkkiṁchi yebunanunnām̐ḍa viṭṭĕ yĕram̐ganaṭṭe kobagiṁchugŏnarādu kori nīdo navvarādu vobinabanisesi vŏddanuṁḍe nenu (||kādu||) kāminigi sannasesi kāniga nāgippiṁchi yemiyani aḍigevu yĕram̐ganaṭṭe momoḍa viḍuvarāduna mŏkkalamuseyarādu gomuna nīgŏluvulo kuṁcha vese nenu (||kādu||) yiṁtise viḍĕmippiṁchi yĕggulĕllām̐ dīrsidivi yĕṁtagĕṁta sesidivi yĕram̐ganaṭṭe kāṁtum̐ḍa śhrī vĕṁkaḍeśha kalasidiviḍu nannu paṁtānagu nīgunem̐ḍu pādālŏtte nenu