Title (Indic)కాదు గూడదనఁబోతే కాయౌనా పండు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదు గూడదనఁబోతే కాయౌనా పండు పాదుకొని యలవాటై పరగె మామనసు (॥కాదు॥) ముచ్చట లాపె నీతో మునుకొని యాడఁగాను నచ్చుకొట్టి కొంతగొంత నవ్వవా నీవు పచ్చిదేరె మీవలపు బయటఁబడేఁ జేతలు యిచ్చట నీవు మాతో నిఁక నేల దాఁచను (॥కాదు॥) చనవున నీ కప్పుడు సన్న లాప సేయఁగాను వొనరఁగ నమ్మతించి వుండవా నీవు కనుపట్టె మీజాడలు కవతలు వాపాట మాయ తనిసితి విన్నిటాను తలపోఁత లేఁటికి (॥కాదు॥) చెలరేఁగి యాపె నీకు చేతులెత్తి మొక్కఁగాను వెలనుండి యట్టె దీవించవా నీవు యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె కలసే వావులెల్లాను కందువాయ రతులు English(||pallavi||) kādu gūḍadanam̐bode kāyaunā paṁḍu pādugŏni yalavāḍai paragĕ māmanasu (||kādu||) muchchaḍa lābĕ nīdo munugŏni yāḍam̐gānu nachchugŏṭṭi kŏṁtagŏṁta navvavā nīvu pachchiderĕ mīvalabu bayaḍam̐baḍem̐ jedalu yichchaḍa nīvu mādo nim̐ka nela dām̐sanu (||kādu||) sanavuna nī kappuḍu sanna lāba seyam̐gānu vŏnaram̐ga nammadiṁchi vuṁḍavā nīvu kanubaṭṭĕ mījāḍalu kavadalu vābāḍa māya tanisidi vinniḍānu talabom̐ta lem̐ṭigi (||kādu||) sĕlarem̐gi yābĕ nīgu sedulĕtti mŏkkam̐gānu vĕlanuṁḍi yaṭṭĕ dīviṁchavā nīvu yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ kalase vāvulĕllānu kaṁduvāya radulu