Title (Indic)కాదు గూడదంటిమా కమ్మటి నీతో నేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదు గూడదంటిమా కమ్మటి నీతో నేము పోదిసేసి నీకు నీవే పొదిగేవు గాక (॥॥) పంతమాడేమా నీతో బలుములు చూపేమా వింతవారమా నేము వేగినంతాను యెంతేసి వేఁడుకొనేవు ఇక్కువలేలంటేవు కాంతల నేలంపేవు కమ్మటి మాయింటికి (॥॥) యేడనుంటి వంటిమా యెగ్గులు వట్టితిమా వీడె మియ్యకుండితిమా వేగినంతాను వోడకేల కొసరేవు వొడివట్టేల తీసేవు అడకే లేకలువాసి అంపేవేల ఇంటికి (॥॥) సేవ సేయకుండితిమా శ్రీవేంకటేశ్వర నీకు వేవేల రతులందమా వేగినంతాను పూవుల నేల వేసేవు పొంచి యేల నవ్వించేవు ఆవటించి వచ్చేవు నీవప్పటి మాయింటికి English(||pallavi||) kādu gūḍadaṁṭimā kammaḍi nīdo nemu podisesi nīgu nīve pŏdigevu gāga (||||) paṁtamāḍemā nīdo balumulu sūbemā viṁtavāramā nemu veginaṁtānu yĕṁtesi vem̐ḍugŏnevu ikkuvalelaṁṭevu kāṁtala nelaṁpevu kammaḍi māyiṁṭigi (||||) yeḍanuṁṭi vaṁṭimā yĕggulu vaṭṭidimā vīḍĕ miyyaguṁḍidimā veginaṁtānu voḍagela kŏsarevu vŏḍivaṭṭela tīsevu aḍage legaluvāsi aṁpevela iṁṭigi (||||) seva seyaguṁḍidimā śhrīveṁkaḍeśhvara nīgu vevela radulaṁdamā veginaṁtānu pūvula nela vesevu pŏṁchi yela navviṁchevu āvaḍiṁchi vachchevu nīvappaḍi māyiṁṭigi