Title (Indic)కాతరపువాఁడవు గజరు నీకుఁ బట్టితే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాతరపువాఁడవు గజరు నీకుఁ బట్టితే నీతి యెఱిఁగినదాన నిన్నుఁ గాదనేనా (॥కాతర॥) చనవరికాంతతో సరసము లాడఁగాను కొనమాట లందుకొనే కూళాఁ గద్దా వినేటి విభుఁడవు వివరించుకో కుండితే పనియెఱిఁగినదాన పలికేనా నేను (॥కాతర॥) మెఱసి వరుసకున మెలుఁత గాచుకుండఁగా యెఱుకలు సేసుకొనే యెడ్డాఁ గద్దా మొఱఁగుల మగఁడవు ముంద రెంచకుండితేను వఱటులు వట్టేదాన వొరసేనా నేను (॥కాతర॥) నిన్నుఁ గూడినచెలి నివ్వెఱఁగుతో నుండఁగా కన్నుమొఱఁగి కలిసే గబ్బీఁ గద్దా నన్నుఁ గూడి శ్రీవేంకటనాయక నీవు నవ్వితే మన్నింపించుకొన్నదాన మఱచేనా నేను English(||pallavi||) kādarabuvām̐ḍavu gajaru nīgum̐ baṭṭide nīdi yĕṟim̐ginadāna ninnum̐ gādanenā (||kādara||) sanavarigāṁtado sarasamu lāḍam̐gānu kŏnamāḍa laṁdugŏne kūḽām̐ gaddā vineḍi vibhum̐ḍavu vivariṁchugo kuṁḍide paniyĕṟim̐ginadāna paligenā nenu (||kādara||) mĕṟasi varusaguna mĕlum̐ta gāsuguṁḍam̐gā yĕṟugalu sesugŏne yĕḍḍām̐ gaddā mŏṟam̐gula magam̐ḍavu muṁda rĕṁchaguṁḍidenu vaṟaḍulu vaṭṭedāna vŏrasenā nenu (||kādara||) ninnum̐ gūḍinasĕli nivvĕṟam̐gudo nuṁḍam̐gā kannumŏṟam̐gi kalise gabbīm̐ gaddā nannum̐ gūḍi śhrīveṁkaḍanāyaga nīvu navvide manniṁpiṁchugŏnnadāna maṟasenā nenu