Title (Indic)కాతరపుదాన నేను ఘనుఁడు తాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాతరపుదాన నేను ఘనుఁడు తాను ఘాతలు నింత కోపితే కరుణిచుమనవే (॥కాత॥) కొప్పువట్టి తియ్యరాదు కొనగోర నూఁదరాదు చెప్పి తన పొందు లెట్టు సేయుమనీనే ముప్పిఁ దిట్టఁగరాదు మోవి గంటిసేయరాదు అప్పటి సరసమెట్లాడు మనీనే (॥కాత॥) తమ్ములను వెట్టరాదు తతిఁగాలు వేయరాదు నమ్మించి తనతో నెట్టు నవ్వుమనీనే కిమ్ముల రా కొట్టరాదు కిందు పరచఁగరాదు కమ్మటి తన మేనెట్లు కాఁగిలించుమనీనే (॥కాత॥) చేముట్టి చెనకరాదు చేరి పనిగొనరాదు ఆముకొని యెట్టు పెండ్లాడుమనీనే యీమేర శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె కామించి తనకు నెట్టు కత చెప్పుమనీనే English(||pallavi||) kādarabudāna nenu ghanum̐ḍu tānu ghādalu niṁta kobide karuṇisumanave (||kāda||) kŏppuvaṭṭi tiyyarādu kŏnagora nūm̐darādu sĕppi tana pŏṁdu lĕṭṭu seyumanīne muppim̐ diṭṭam̐garādu movi gaṁṭiseyarādu appaḍi sarasamĕṭlāḍu manīne (||kāda||) tammulanu vĕṭṭarādu tadim̐gālu veyarādu nammiṁchi tanado nĕṭṭu navvumanīne kimmula rā kŏṭṭarādu kiṁdu parasam̐garādu kammaḍi tana menĕṭlu kām̐giliṁchumanīne (||kāda||) semuṭṭi sĕnagarādu seri panigŏnarādu āmugŏni yĕṭṭu pĕṁḍlāḍumanīne yīmera śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ kāmiṁchi tanagu nĕṭṭu kada sĕppumanīne