Title (Indic)కాదన్నవారికి వారికర్మమే సాక్షి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదన్నవారికి వారికర్మమే సాక్షి యేదెస చూచిన మాకు నీతఁడే సాక్షి (॥కాద॥) వేదాలు సత్యమౌటకు విష్ణుఁడు మత్స్యరూపమై ఆదటఁ దెచ్చి నిలిపెనది సాక్షి ఆదిఁ గర్మములు సత్యమౌటకు బ్రహ్మాయఁగాన పోదితో నీతఁడు యజ్ఞ భోక్తౌటే సాక్షి (॥కాద॥) అదె బ్రహ్మము సాకారమౌటకు పురుషసూక్తఁ మెదుట విశ్వరూపము యిది సాక్షి మొదలనుండి ప్రపంచమును తథ్యమగుటకు పొదిగొన్న యాగములే భువిలో సాక్షి (॥కాద॥) బెరసి జీవేశ్వరుల భేదము గలుగుటకు పొరి బ్రహ్మాదుల హరిపూజలే సాక్షి యిరవై దాస్యాన మోక్షమిచ్చు నీతఁడనుటకు వరమిచ్చే శ్రీవేంకటేశ్వరుఁడే సాక్షి English(||pallavi||) kādannavārigi vārigarmame sākṣhi yedĕsa sūsina māgu nīdam̐ḍe sākṣhi (||kāda||) vedālu satyamauḍagu viṣhṇum̐ḍu matsyarūbamai ādaḍam̐ dĕchchi nilibĕnadi sākṣhi ādim̐ garmamulu satyamauḍagu brahmāyam̐gāna podido nīdam̐ḍu yajña bhoktauḍe sākṣhi (||kāda||) adĕ brahmamu sāgāramauḍagu puruṣhasūktam̐ mĕduḍa viśhvarūbamu yidi sākṣhi mŏdalanuṁḍi prabaṁchamunu tathyamaguḍagu pŏdigŏnna yāgamule bhuvilo sākṣhi (||kāda||) bĕrasi jīveśhvarula bhedamu galuguḍagu pŏri brahmādula haribūjale sākṣhi yiravai dāsyāna mokṣhamichchu nīdam̐ḍanuḍagu varamichche śhrīveṁkaḍeśhvarum̐ḍe sākṣhi