Title (Indic)కాదనినందుకు నీవు గలితేఁ జాలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదనినందుకు నీవు గలితేఁ జాలు నీదాననైతిఁ గాక నించనోప నిఁకను (॥కాద॥) చక్కని నీ వదనమే చంద్రోదయము నాకు చుక్కలేని మోవి మీఁది సూదివాట్లు వెక్కనపు నీ నవ్వు వెన్నెలపులుఁగములు వొక్కటైతి నలుగ నేనోప నీతో నిఁకను (॥కాద॥) నీ మేనిచెమటలు నిండినట్టిమంచు నాకు అమనివూరుపులే పయ్యరరగాలి కోమలపుఁబులకలె కూరిమి గుజ్జనఁగూళ్శు యేమిగల్లా నియ్యకొంటి నెదురాడనోపను (॥కాద॥) కాఁగిననీరతిపొందే కందువరాతిరి నాకు మూఁగిన పరవశాలే ముంపునిద్దుర వీఁగక శ్రీ వేంకటేశ వేడుక నీసరసమే పాఁగినట్టితలఁబాలు పదరకు మికను English(||pallavi||) kādaninaṁdugu nīvu galidem̐ jālu nīdānanaidim̐ gāga niṁchanoba nim̐kanu (||kāda||) sakkani nī vadaname saṁdrodayamu nāgu sukkaleni movi mīm̐di sūdivāṭlu vĕkkanabu nī navvu vĕnnĕlabulum̐gamulu vŏkkaḍaidi naluga nenoba nīdo nim̐kanu (||kāda||) nī menisĕmaḍalu niṁḍinaṭṭimaṁchu nāgu amanivūrubule payyararagāli komalabum̐bulagalĕ kūrimi gujjanam̐gūḽśhu yemigallā niyyagŏṁṭi nĕdurāḍanobanu (||kāda||) kām̐ginanīradibŏṁde kaṁduvarādiri nāgu mūm̐gina paravaśhāle muṁpuniddura vīm̐gaga śhrī veṁkaḍeśha veḍuga nīsarasame pām̐ginaṭṭidalam̐bālu padaragu miganu