Title (Indic)కాదని తోయఁగ నెంతటివారలు ఘనసంసారులు నరులును సురలును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదని తోయఁగ నెంతటివారలు ఘనసంసారులు నరులును సురలును నీ దాసులతో సంగతి సేయఁగ నిర్మలచిత్తం బయ్యీఁ గాక (॥కాదని॥) హరి నీ మాయె విజృంభించునట నడఁచే మన నెవ్వరితరము దరిగొని నీకె మొక్కఁగ తానే మన్నీంచీఁ గాక నిరతి నీ యాజ్ఞ జగతిఁ జెల్లునట నెట్టిన నిది గడచేవా రెవ్వరు ధరణిలోని వారమని యాదుకొనఁగ తప్పులు వట్టక కాచీఁగాకా (॥కాదని॥) ధాత నీసుతుఁడు పుట్టించువాఁడట తగదని తోయఁగ సెవ్వఁ డోపు నిఁక ఆతుమలో నిను ధ్యానము సేయఁగ నతఁడే మొగమోడీఁ గాక ఘాతలమదనుఁడు మదము రేఁచునట కాదని గెలువఁగఁ గలరాయెవ్వరు రాతిరిఁ బగలును నిన్నె జపించఁగ రతిఁ గైవస మయ్యీఁ గాకా (॥కాదని॥) నీ కల్పితమగు కర్మమంటు నట నెఱి విడిపించఁగ సమర్థు లెవ్వరు చేకొని నీవే గతి యని యుండఁగ చిక్కులఁ బెట్టుక చనుఁగాక యీకడ శ్రీవేంకటేశ్వర నీవే యెందుఁజూచినా నంతరాత్మ వట పైకొని నిన్నే నమ్మి వుండఁగాఁ బ్రసన్నుఁడవు నీ వయ్యేవుగాక English(||pallavi||) kādani toyam̐ga nĕṁtaḍivāralu ghanasaṁsārulu narulunu suralunu nī dāsulado saṁgadi seyam̐ga nirmalasittaṁ bayyīm̐ gāga (||kādani||) hari nī māyĕ vijṛṁbhiṁchunaḍa naḍam̐se mana nĕvvaridaramu darigŏni nīgĕ mŏkkam̐ga tāne mannīṁchīm̐ gāga niradi nī yājña jagadim̐ jĕllunaḍa nĕṭṭina nidi gaḍasevā rĕvvaru dharaṇiloni vāramani yādugŏnam̐ga tappulu vaṭṭaga kāsīm̐gāgā (||kādani||) dhāda nīsudum̐ḍu puṭṭiṁchuvām̐ḍaḍa tagadani toyam̐ga sĕvvam̐ ḍobu nim̐ka ādumalo ninu dhyānamu seyam̐ga nadam̐ḍe mŏgamoḍīm̐ gāga ghādalamadanum̐ḍu madamu rem̐sunaḍa kādani gĕluvam̐gam̐ galarāyĕvvaru rādirim̐ bagalunu ninnĕ jabiṁcham̐ga radim̐ gaivasa mayyīm̐ gāgā (||kādani||) nī kalbidamagu karmamaṁṭu naḍa nĕṟi viḍibiṁcham̐ga samardhu lĕvvaru segŏni nīve gadi yani yuṁḍam̐ga sikkulam̐ bĕṭṭuga sanum̐gāga yīgaḍa śhrīveṁkaḍeśhvara nīve yĕṁdum̐jūsinā naṁtarātma vaḍa paigŏni ninne nammi vuṁḍam̐gām̐ brasannum̐ḍavu nī vayyevugāga