Title (Indic)కాదని తొలఁగరాదు కైకొని మెలఁగరాదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదని తొలఁగరాదు కైకొని మెలఁగరాదు యీ దెస నాతని చిత్త మెట్టుండునో (॥కాద॥) వొత్తి మాఁటలాడితేను వొకటొకటె తోఁచును మత్తిలి నవ్వు నవ్వితే మందెమేళమౌ బత్తి సేయఁగా జేయఁగా పైపై మొగచాటౌను ఇత్తల పతితోఁ బొందు లెటువలె జేతునే (॥కాద॥) సారె సరస మాడఁగా చలములు మీరి వచ్చు చేరి చేరి చూడఁగాను సిగ్గులు నిండు మేరిమీరి కొసరఁగా మిక్కిలి వేసటలౌను నేరుపులు వచరించ నే నెట్టు నేరుతునే (॥కాద॥) చెనకి కాఁగిలించితే చిత్తము నీరై కరఁగు పెనఁగితే తమకములు పెచ్చు వెరుగు యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేఁడు పను లీతనివి యెంత పచారించవచ్చునే English(||pallavi||) kādani tŏlam̐garādu kaigŏni mĕlam̐garādu yī dĕsa nādani sitta mĕṭṭuṁḍuno (||kāda||) vŏtti mām̐ṭalāḍidenu vŏgaḍŏgaḍĕ tom̐sunu mattili navvu navvide maṁdĕmeḽamau batti seyam̐gā jeyam̐gā paibai mŏgasāḍaunu ittala padidom̐ bŏṁdu lĕḍuvalĕ jedune (||kāda||) sārĕ sarasa māḍam̐gā salamulu mīri vachchu seri seri sūḍam̐gānu siggulu niṁḍu merimīri kŏsaram̐gā mikkili vesaḍalaunu nerubulu vasariṁcha ne nĕṭṭu nerudune (||kāda||) sĕnagi kām̐giliṁchide sittamu nīrai karam̐gu pĕnam̐gide tamagamulu pĕchchu vĕrugu yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nem̐ḍu panu līdanivi yĕṁta pasāriṁchavachchune