Title (Indic)కాదని సాదించి నిన్ను కన్నుల జంకించేనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదని సాదించి నిన్ను కన్నుల జంకించేనా ఆది గొని యిటువలె నైతిఁ బో పైకొసరు (॥కాద॥) సుద్దులొక్కతె తోడుత చూపులొక్కతెమీఁదట వుద్దండవు చేఁతలు వేరొకతెమేన పెద్దరికేలకు నీవు బెరయించేవు వలపు అద్దివో యిందరిలోన నైఁతిబో పైకొసరు (॥కాద॥) నవ్వులొక్కతె ముందర నమ్మికలొకతెవద్ద వువ్విళ్ళూర నడియాస లొక్కతెకును రవ్వలకు నిట్లా నేరము కుప్పవేసేవు అవ్వలివ్వలివారిలో నైతిఁబో పైకొసరు (॥కాద॥) సిగ్గులొకతె పొంతను శిరసొకతె తొడపై వొగ్గినచేతులు వేరొకతెపై నిగ్గుల శ్రీవేంకటేశ నేనలమేలుమంగను అగ్గమై కూడితివిందు నైతిఁబో పైకొసరు English(||pallavi||) kādani sādiṁchi ninnu kannula jaṁkiṁchenā ādi gŏni yiḍuvalĕ naidim̐ bo paigŏsaru (||kāda||) suddulŏkkadĕ toḍuda sūbulŏkkadĕmīm̐daḍa vuddaṁḍavu sem̐talu verŏgadĕmena pĕddarigelagu nīvu bĕrayiṁchevu valabu addivo yiṁdarilona naim̐tibo paigŏsaru (||kāda||) navvulŏkkadĕ muṁdara nammigalŏgadĕvadda vuvviḽḽūra naḍiyāsa lŏkkadĕgunu ravvalagu niṭlā neramu kuppavesevu avvalivvalivārilo naidim̐bo paigŏsaru (||kāda||) siggulŏgadĕ pŏṁtanu śhirasŏgadĕ tŏḍabai vŏgginasedulu verŏgadĕbai niggula śhrīveṁkaḍeśha nenalamelumaṁganu aggamai kūḍidiviṁdu naidim̐bo paigŏsaru