Title (Indic)కాదనేనా నేనిన్ను కన్నులారాఁ జూచితి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదనేనా నేనిన్ను కన్నులారాఁ జూచితి పొది సేసి నన్ను నెట్టు బుజ్జగించేవయ్యా (॥కాద॥) విన్నపములు వింటివి వీడె మింతి కిచ్చితివి పన్నుక నన్నెంత వొడఁ బరచేవయ్యా సన్న సేసితి వాపెతో సరసమూ నాడితివి చన్నులంటి నాతో నేమి సరి వెనఁగేవయ్యా (॥కాద॥) తప్పక చూచితి వాపె దగ్గరఁ గూచుండితివి అప్పటి నా పొందుసేసే వది యేమయ్యా కొప్పు దువ్వి పెట్టి కాంతకొంగు వట్టుకున్నాడవు ముప్పిరి నాకిట్టె యెంత మోవి యిచ్చేవయ్యా (॥కాద॥) పొసఁగ నవ్వితి వాపె పొత్తుకుఁ బిలిచితివి కొసరి నన్నెంత వేఁడుకొనేవయ్యా యెసగ శ్రీవేంకటేశ యేలితివి మమ్మిద్దరి రసికుఁడ వలపెంత రచ్చ వేసేవయ్యా English(||pallavi||) kādanenā neninnu kannulārām̐ jūsidi pŏdi sesi nannu nĕṭṭu bujjagiṁchevayyā (||kāda||) vinnabamulu viṁṭivi vīḍĕ miṁti kichchidivi pannuga nannĕṁta vŏḍam̐ barasevayyā sanna sesidi vābĕdo sarasamū nāḍidivi sannulaṁṭi nādo nemi sari vĕnam̐gevayyā (||kāda||) tappaga sūsidi vābĕ daggaram̐ gūsuṁḍidivi appaḍi nā pŏṁdusese vadi yemayyā kŏppu duvvi pĕṭṭi kāṁtagŏṁgu vaṭṭugunnāḍavu muppiri nāgiṭṭĕ yĕṁta movi yichchevayyā (||kāda||) pŏsam̐ga navvidi vābĕ pŏttugum̐ bilisidivi kŏsari nannĕṁta vem̐ḍugŏnevayyā yĕsaga śhrīveṁkaḍeśha yelidivi mammiddari rasigum̐ḍa valabĕṁta rachcha vesevayyā