Title (Indic)కాదనేనా ఇఁక నీపై గాఁతాళించేనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదనేనా ఇఁక నీపై గాఁతాళించేనా సాదవైతి వన్నిటాను సంగతాయఁ బనులు (॥కాద॥) చేయరానిచేఁత చేసి చెక్కవట్టి వేఁడుకోఁగా ఆయనాయ నిందువంకనైనదేమి నాయ మెవ్వరు చెప్పేరు నాకు నీకు నడుమను చాయకుఁ దెచ్చుకొంటివి సంగతాయఁ బనులు (॥కాద॥) జాలిఁబెట్టి మాటలాడి సమ్మతిగాఁ జేయఁగాను చాలుఁజాలు నిందువంక సాదించేదేమి తాలి మెక్కడ నున్నది తవిసితి మిద్దరము పోలికలు చూపేవు పొసఁగె నీపనులు (॥కాద॥) వెంట నాకెఁ దోడితెచ్చి వేరేమరఁగు వెట్టఁగా కంటిఁగంటి నిందువంకఁ గలిగేదేమి ఇంటివద్ద శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి జంటవై నెలకొంటివి చక్కనాయఁ బనులు English(||pallavi||) kādanenā im̐ka nībai gām̐tāḽiṁchenā sādavaidi vanniḍānu saṁgadāyam̐ banulu (||kāda||) seyarānisem̐ta sesi sĕkkavaṭṭi vem̐ḍugom̐gā āyanāya niṁduvaṁkanainademi nāya mĕvvaru sĕpperu nāgu nīgu naḍumanu sāyagum̐ dĕchchugŏṁṭivi saṁgadāyam̐ banulu (||kāda||) jālim̐bĕṭṭi māḍalāḍi sammadigām̐ jeyam̐gānu sālum̐jālu niṁduvaṁka sādiṁchedemi tāli mĕkkaḍa nunnadi tavisidi middaramu poligalu sūbevu pŏsam̐gĕ nībanulu (||kāda||) vĕṁṭa nāgĕm̐ doḍidĕchchi veremaram̐gu vĕṭṭam̐gā kaṁṭim̐gaṁṭi niṁduvaṁkam̐ galigedemi iṁṭivadda śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi jaṁṭavai nĕlagŏṁṭivi sakkanāyam̐ banulu