Title (Indic)కాదనేమా నీ వాపెఁ గాఁగిలించుకొనఁగాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదనేమా నీ వాపెఁ గాఁగిలించుకొనఁగాను యీదెస మమ్మింత భ్రమఇంచకువయ్యా (॥కాద॥) అట్టె ఆపెకుఁ జుట్టమవైతే నౌదుగాక మమ్ము వట్టిపరాకులు సేయవలదయ్యా చుట్టి మాటలాడ సందుచూచుకొంటేఁ గొందుగాక దిట్టవై విడెము మమ్ముఁ దేనంపకువయ్యా (॥కాద॥) చొప్పుగా నీవాపెదిక్కు చూచితే చూతువుగాక కప్పురము మాకన్నుల గుప్పకువయ్యా చిప్పిల బొంద ననుపుసేసుకొంటేఁ గొందువుగాక విప్పుచుఁ బచ్చడము పైఁగప్పకువయ్యా (॥కాద॥) పిలిచి యాపెకు సొమ్ము పెట్టితేఁ బెట్టుదుగాక వెలచెప్పి పందేలు వేయకువయ్యా చెలి యలమేలుమంగ శ్రీవేంకటేశుఁడవు ఇల మమ్ము నేలితి వెంతవాఁడవయ్యా English(||pallavi||) kādanemā nī vābĕm̐ gām̐giliṁchugŏnam̐gānu yīdĕsa mammiṁta bhrama̮iṁchaguvayyā (||kāda||) aṭṭĕ ābĕgum̐ juṭṭamavaide naudugāga mammu vaṭṭibarāgulu seyavaladayyā suṭṭi māḍalāḍa saṁdusūsugŏṁṭem̐ gŏṁdugāga diṭṭavai viḍĕmu mammum̐ denaṁpaguvayyā (||kāda||) sŏppugā nīvābĕdikku sūside sūduvugāga kappuramu māgannula guppaguvayyā sippila bŏṁda nanubusesugŏṁṭem̐ gŏṁduvugāga vippusum̐ bachchaḍamu paim̐gappaguvayyā (||kāda||) pilisi yābĕgu sŏmmu pĕṭṭidem̐ bĕṭṭudugāga vĕlasĕppi paṁdelu veyaguvayyā sĕli yalamelumaṁga śhrīveṁkaḍeśhum̐ḍavu ila mammu nelidi vĕṁtavām̐ḍavayyā