Title (Indic)కాదనేటి వారెవ్వరు కడలనుండి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదనేటి వారెవ్వరు కడలనుండి సేద దేరిచి నీవేమి సేసినానుఁ జెల్లును (॥కాద॥) తక్కక బ్రహ్మాది దేవతలకు నాయకుఁడవు మక్కువ శ్రీసతికి మగఁడవు చక్కనివాఁడవు మరి చంద్రసూర్యనేత్రుఁడవు వుక్కు మీరి నీ వెట్లానుండినా నమరును (॥కాద॥) కామునిఁ గన్నతండ్రివి కడుఁ జక్కఁదనమున ఆముకొన్నయట్టి చక్రాయుధుఁడవు కామించి యెందుఁ జూచినా గరుడవాహనుఁడవు వేమరు నీవెటువలె వెలసినా నమరును (॥కాద॥) అందరి లోపలనుండే అంతర్యామివి నీవు చందమైన పరబ్రహ్మస్వరూపుఁడవు యెందును శ్రీవేంకటాద్రి నిరవైనవాఁడవు అంది మమ్ము నేలితేను అన్నిటా నమరును English(||pallavi||) kādaneḍi vārĕvvaru kaḍalanuṁḍi seda derisi nīvemi sesinānum̐ jĕllunu (||kāda||) takkaga brahmādi devadalagu nāyagum̐ḍavu makkuva śhrīsadigi magam̐ḍavu sakkanivām̐ḍavu mari saṁdrasūryanetrum̐ḍavu vukku mīri nī vĕṭlānuṁḍinā namarunu (||kāda||) kāmunim̐ gannadaṁḍrivi kaḍum̐ jakkam̐danamuna āmugŏnnayaṭṭi sakrāyudhum̐ḍavu kāmiṁchi yĕṁdum̐ jūsinā garuḍavāhanum̐ḍavu vemaru nīvĕḍuvalĕ vĕlasinā namarunu (||kāda||) aṁdari lobalanuṁḍe aṁtaryāmivi nīvu saṁdamaina parabrahmasvarūbum̐ḍavu yĕṁdunu śhrīveṁkaḍādri niravainavām̐ḍavu aṁdi mammu nelidenu anniḍā namarunu