Title (Indic)కాదనగవచ్చునా ఘనుఁడ నీతోడి పొందు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదనగవచ్చునా ఘనుఁడ నీతోడి పొందు యేదైనా నియ్యకొంటె నెక్కుడేకాదా (॥॥) నీకు సెలవైతేఁజాలు నీమోహపుసతులకు చేకొని ప్రియము లెల్లా జెప్పేమయ్యా యీకడ నాకడ నీకు హితవైతేఁ జాలుఁగాక మాకేమి వారినేరాలు మరచేవయ్యా (॥॥) నట్టనడుమను నీకు నవ్వువచ్చితేజాలు వొట్టి వారిచేఁతలకు నోరిచేమయ్యా మట్టుమీర నేఁడు నీమనసు వచ్చితేఁజాలు గట్టిగా నెంగిలిపొత్తు గలసేమయ్యా (॥॥) చక్కఁగ నీకే పొందు సంతోసమైతేఁ జాలు వొక్కచోట నిద్దరము నుండేమయ్యా యిక్కువతో శ్రీ వేంకటేశ మమ్ముఁ గూడితివి చిక్కించుక నీపాదాలసేవ సేసేమయ్యా English(||pallavi||) kādanagavachchunā ghanum̐ḍa nīdoḍi pŏṁdu yedainā niyyagŏṁṭĕ nĕkkuḍegādā (||||) nīgu sĕlavaidem̐jālu nīmohabusadulagu segŏni priyamu lĕllā jĕppemayyā yīgaḍa nāgaḍa nīgu hidavaidem̐ jālum̐gāga māgemi vārinerālu marasevayyā (||||) naṭṭanaḍumanu nīgu navvuvachchidejālu vŏṭṭi vārisem̐talagu norisemayyā maṭṭumīra nem̐ḍu nīmanasu vachchidem̐jālu gaṭṭigā nĕṁgilibŏttu galasemayyā (||||) sakkam̐ga nīge pŏṁdu saṁtosamaidem̐ jālu vŏkkasoḍa niddaramu nuṁḍemayyā yikkuvado śhrī veṁkaḍeśha mammum̐ gūḍidivi sikkiṁchuga nībādālaseva sesemayyā