Title (Indic)కాదంటినా నేను కడు నానవెట్టి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదంటినా నేను కడు నానవెట్టి సోదించితి నాఁడే జోకలాయనే (॥కాదంటి॥) చల్లని మెల్లని జాజర మాఁటలు చెల్లఁబో యెందాఁకఁ జెప్పీనె కల్లలూనుఁ గావు కావు నిజములు తొల్లే నే వింటిని తుద కెక్కెనే (॥కాదంటి॥) పూచిన కాచిన పున్నమ చేఁతలు చేచేత నెందాఁకఁ జెసీ వే వాచవియుఁ గాదు వాఁటితీపు వోదు ఆచాయనే వున్నవందుకోనీవే (॥కాదంటి॥) వెచ్చియు వేవని వేడుక రతుల చెచ్చెర నేఁటికిఁ జెనకీనే యిచ్చట శ్రీవేంకటేశుఁ డేలెఁ దానే వచ్చెఁ బదివేలు వాఁటమాయనే English(||pallavi||) kādaṁṭinā nenu kaḍu nānavĕṭṭi sodiṁchidi nām̐ḍe jogalāyane (||kādaṁṭi||) sallani mĕllani jājara mām̐ṭalu sĕllam̐bo yĕṁdām̐kam̐ jĕppīnĕ kallalūnum̐ gāvu kāvu nijamulu tŏlle ne viṁṭini tuda kĕkkĕne (||kādaṁṭi||) pūsina kāsina punnama sem̐talu seseda nĕṁdām̐kam̐ jĕsī ve vāsaviyum̐ gādu vām̐ṭidību vodu āsāyane vunnavaṁdugonīve (||kādaṁṭi||) vĕchchiyu vevani veḍuga radula sĕchchĕra nem̐ṭigim̐ jĕnagīne yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐ dāne vachchĕm̐ badivelu vām̐ṭamāyane