Title (Indic)కాదందునో అవునందునో గరిమలు నీవి చూచి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదందునో అవునందునో గరిమలు నీవి చూచి సోదించి తెలుసుకొని చొక్కితి నిట్టె నేను (॥కాదం॥) నగితే నీ సెలవుల నయమై వెన్నెల గాసీ మొగము చూచితేను ముద్దు గారీని యెగసక్కేలాడేనంటే యెట్టు మనసు గొలుపు పగటు నీ చేఁతలకు బ్రమసితి నేను (॥కాదం॥) మాఁటలాడి చూచితేను మంచితనాలే వూరీ వాఁటపు నీ చూపులను వలపే నిండీ ఆఁ టదాన జంకించ నందుకెట్టు వొడఁబడే కూటువ నీ మన్ననల గురుతైతి నేను (॥కాదం॥) సారెఁ గాఁగిలించుకొంటే సంతోసములే మించీ కూరిమి నీవు గూడిన కూటమే చెప్పీ యీరీతి శ్రీ వేంకటేశ యేమని పొగడవచ్చు తారుకాణ నీరతులఁ దనిసితి నేను English(||pallavi||) kādaṁduno avunaṁduno garimalu nīvi sūsi sodiṁchi tĕlusugŏni sŏkkidi niṭṭĕ nenu (||kādaṁ||) nagide nī sĕlavula nayamai vĕnnĕla gāsī mŏgamu sūsidenu muddu gārīni yĕgasakkelāḍenaṁṭe yĕṭṭu manasu gŏlubu pagaḍu nī sem̐talagu bramasidi nenu (||kādaṁ||) mām̐ṭalāḍi sūsidenu maṁchidanāle vūrī vām̐ṭabu nī sūbulanu valabe niṁḍī ām̐ ṭadāna jaṁkiṁcha naṁdugĕṭṭu vŏḍam̐baḍe kūḍuva nī mannanala gurudaidi nenu (||kādaṁ||) sārĕm̐ gām̐giliṁchugŏṁṭe saṁtosamule miṁchī kūrimi nīvu gūḍina kūḍame sĕppī yīrīdi śhrī veṁkaḍeśha yemani pŏgaḍavachchu tārugāṇa nīradulam̐ danisidi nenu