Title (Indic)జరపులనే పొద్దు వోయ చాలదా యింక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) జరపులనే పొద్దు వోయ చాలదా యింక సరుసఁ గడపరాయ చాలదా యింకా (॥జరపల॥) కేరి కేరి చెలి నీవు కిలకిల నవ్వించఁగ సారెకుఁ జెమట జారె చాలదా యింక గారవించి యాకెచేతఁ గతలు చెప్పించుకోఁగా సారవు బెదవు లెండె చాలదా యింకా (॥జరపల॥) సాజపుఁ బచ్చిమాటలు సతితోడ నాడఁ గాను జాజుకొనఁ బులకించె చాలదా యింకా తేజమునఁ బానుపుపై తెగి సరసమాడఁగా జాజుల కొప్పెల్లా వీడె చాలదా యింకా (॥జరపల॥) నిరతిఁ జన్నులపై కిన్నెర వాయింపించఁగాను సరి నిట్టూర్పులు రేఁగె చాలదా యింకా పరవశమై కూడగాఁ భామను శ్రీవేంకటేశ సరుగఁ బంతము చెల్లె చాలదా యింక English(||pallavi||) jarabulane pŏddu voya sāladā yiṁka sarusam̐ gaḍabarāya sāladā yiṁkā (||jarabala||) keri keri sĕli nīvu kilagila navviṁcham̐ga sārĕgum̐ jĕmaḍa jārĕ sāladā yiṁka gāraviṁchi yāgĕsedam̐ gadalu sĕppiṁchugom̐gā sāravu bĕdavu lĕṁḍĕ sāladā yiṁkā (||jarabala||) sājabum̐ bachchimāḍalu sadidoḍa nāḍam̐ gānu jājugŏnam̐ bulagiṁchĕ sāladā yiṁkā tejamunam̐ bānububai tĕgi sarasamāḍam̐gā jājula kŏppĕllā vīḍĕ sāladā yiṁkā (||jarabala||) niradim̐ jannulabai kinnĕra vāyiṁpiṁcham̐gānu sari niṭṭūrbulu rem̐gĕ sāladā yiṁkā paravaśhamai kūḍagām̐ bhāmanu śhrīveṁkaḍeśha sarugam̐ baṁtamu sĕllĕ sāladā yiṁka