Title (Indic)జనులాల పూజించరో జయంతి నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) జనులాల పూజించరో జయంతి నేఁడు వొనర నర్ఘ్యమీయరో వుదయించెఁ జంద్రుఁడు (॥జను॥) సవరేయి వుట్టినాఁడు శ్రావణబహుళాష్టమి నవముగా రోహిణినక్షత్రమందు దివిజులు వోగడఁగ దేవకిగర్భమునందు భువిలో వసుదేవునిపుత్రుఁడై కృష్ణుఁడు (॥జను॥) తఱితో యమున దాటి తగఁ బెంచఁ బెట్టిరట గుఱిగా యశోదనందగోపులయింట మఱి జాతకర్మనామకరణాలు సేయరో నెఱి నారగింపులెల్ల నించరో కృష్ణునికి (॥జను॥) చక్కిలాలు నురుగులు సరిఁ బళావళిగట్టి మొక్కరో యీబాలునికి ముద్దుగారీని తక్కకలమేల్మంగతోఁ దగ శ్రీవేంకటేశుఁడై నిక్కిచూచీఁ గోలువురో నెమ్మదిఁ గృష్ణునిని English(||pallavi||) janulāla pūjiṁcharo jayaṁti nem̐ḍu vŏnara narghyamīyaro vudayiṁchĕm̐ jaṁdrum̐ḍu (||janu||) savareyi vuṭṭinām̐ḍu śhrāvaṇabahuḽāṣhṭami navamugā rohiṇinakṣhatramaṁdu divijulu vogaḍam̐ga devagigarbhamunaṁdu bhuvilo vasudevunibutrum̐ḍai kṛṣhṇum̐ḍu (||janu||) taṟido yamuna dāḍi tagam̐ bĕṁcham̐ bĕṭṭiraḍa guṟigā yaśhodanaṁdagobulayiṁṭa maṟi jādagarmanāmagaraṇālu seyaro nĕṟi nāragiṁpulĕlla niṁcharo kṛṣhṇunigi (||janu||) sakkilālu nurugulu sarim̐ baḽāvaḽigaṭṭi mŏkkaro yībālunigi muddugārīni takkagalamelmaṁgadom̐ daga śhrīveṁkaḍeśhum̐ḍai nikkisūsīm̐ goluvuro nĕmmadim̐ gṛṣhṇunini