Title (Indic)జాము వోయ నింకాను సటలేఁటికే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) జాము వోయ నింకాను సటలేఁటికే నీ మతక మింతయు నే మెఱగమా (॥జాము॥) సిగ్గులెందాఁకానే చెఱఁగు వట్టెను పతి యెగ్గు లెందాఁకనే యిదె మొక్కీని నిగ్గుఁజల మెందాఁకానే ని న్నాతఁడు వేఁడుకొనీ వొగ్గి విడె మిమ్మంటే వోపనందురా (॥జాము॥) పెనగు లెందాఁకానే ప్రియపడీ రమణుఁడు కినుక లెందాఁకానే కిందుపడీని జనుగు లెందాంకానే చోటిచ్చీఁ గూడుమంటా నిను గుంచ వేయుమంటా నేరనందురా (॥జాము॥) చిఱునవ్వుం లెందాఁకానే శ్రీవేంకటేశుఁడు గూడె నెఱి నలమేల్మంగవు నిన్ను నిప్పుడే వెఱగు లెందాఁకనే విచ్చనవిళ్లాయ నీకు మఱియుఁ గొసరితేను మచ్చరింతురా English(||pallavi||) jāmu voya niṁkānu saḍalem̐ṭige nī madaga miṁtayu ne mĕṟagamā (||jāmu||) siggulĕṁdām̐kāne sĕṟam̐gu vaṭṭĕnu padi yĕggu lĕṁdām̐kane yidĕ mŏkkīni niggum̐jala mĕṁdām̐kāne ni nnādam̐ḍu vem̐ḍugŏnī vŏggi viḍĕ mimmaṁṭe vobanaṁdurā (||jāmu||) pĕnagu lĕṁdām̐kāne priyabaḍī ramaṇum̐ḍu kinuga lĕṁdām̐kāne kiṁdubaḍīni janugu lĕṁdāṁkāne soḍichchīm̐ gūḍumaṁṭā ninu guṁcha veyumaṁṭā neranaṁdurā (||jāmu||) siṟunavvuṁ lĕṁdām̐kāne śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ nĕṟi nalamelmaṁgavu ninnu nippuḍe vĕṟagu lĕṁdām̐kane vichchanaviḽlāya nīgu maṟiyum̐ gŏsaridenu machchariṁturā