Title (Indic)జాజు జాజేకాక దిరిశపుఁ బువ్వౌనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) జాజు జాజేకాక దిరిశపుఁ బువ్వౌనా నీ జాడెంతయిన నీవు మానేవా (॥జాజు॥) సంపెంగపూవులలోన సారెకుఁ జూచిన తన- కంపే కాక తనకాఁక మానీనా యింపులు గొందరికి యీరసాలు గొందరికి జంపుల నీ గుణముల జాడ మానేవా (॥జాజు॥) పొగడ పూవులలోన పొందుగఁ జూచిన తావి తగుఁగాక తా మదము మానీనా నిగిడిన నీచేఁత నీ బోంట్ల కే కాక మగిడి నీగుణములు మంచివయ్యీనా (॥జాజు॥) కామించి కలువలు కన్నులనద్దుకొనిన కామునమ్ములునేఁడు గాక మానీనా దీమసపు వేంకటేశ తెమలని కూటముల ఆమని మాకోరికల ఆస మానీనా English(||pallavi||) jāju jājegāga diriśhabum̐ buvvaunā nī jāḍĕṁtayina nīvu mānevā (||jāju||) saṁpĕṁgabūvulalona sārĕgum̐ jūsina tana- kaṁpe kāga tanagām̐ka mānīnā yiṁpulu gŏṁdarigi yīrasālu gŏṁdarigi jaṁpula nī guṇamula jāḍa mānevā (||jāju||) pŏgaḍa pūvulalona pŏṁdugam̐ jūsina tāvi tagum̐gāga tā madamu mānīnā nigiḍina nīsem̐ta nī boṁṭla ke kāga magiḍi nīguṇamulu maṁchivayyīnā (||jāju||) kāmiṁchi kaluvalu kannulanaddugŏnina kāmunammulunem̐ḍu gāga mānīnā dīmasabu veṁkaḍeśha tĕmalani kūḍamula āmani māgorigala āsa mānīnā