Title (Indic)ఇరుగుపొరుగు వింటే నిఁక నేమందురో కాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇరుగుపొరుగు వింటే నిఁక నేమందురో కాని సరి నూడిగపువారు శిరసులు వంచిరి (॥॥) నిలుచుండి మోవి యిచ్చి నెలఁతనుఁ గాఁగిలించి అలరించేవు రతుల నందగాఁడవై చెలులు మి మ్మిటు చూచి సిగ్గులువడుచు లోలో తెలిఁగన్నులతోడుత తెరవేసుకొనిరి (॥॥) తొడలపై నెక్కించుక తొయ్యలితో దోమట్లు దొడికేవు కూటములఁ దోడుతోడనె బడినన్ను పేరటాండ్లు భావములెల్లాఁ దెలిసి తడఁబాటుతో నవ్వు దాఁచి గుక్కుకొనిరి (॥॥) వొత్తగిలి పవ్వళించి వువిదఁ బైపైఁ గలసి పొత్తారగించితిని బువ్వముగాను ఇత్తల శ్రీవేంకటేశ యెరిఁగి నన్ను గూడఁగా సత్తుగా సవతులెల్లా సన్నలు గావించిరి English(||pallavi||) irugubŏrugu viṁṭe nim̐ka nemaṁduro kāni sari nūḍigabuvāru śhirasulu vaṁchiri (||||) nilusuṁḍi movi yichchi nĕlam̐tanum̐ gām̐giliṁchi alariṁchevu radula naṁdagām̐ḍavai sĕlulu mi mmiḍu sūsi sigguluvaḍusu lolo tĕlim̐gannuladoḍuda tĕravesugŏniri (||||) tŏḍalabai nĕkkiṁchuga tŏyyalido domaṭlu dŏḍigevu kūḍamulam̐ doḍudoḍanĕ baḍinannu peraḍāṁḍlu bhāvamulĕllām̐ dĕlisi taḍam̐bāḍudo navvu dām̐si gukkugŏniri (||||) vŏttagili pavvaḽiṁchi vuvidam̐ baibaim̐ galasi pŏttāragiṁchidini buvvamugānu ittala śhrīveṁkaḍeśha yĕrim̐gi nannu gūḍam̐gā sattugā savadulĕllā sannalu gāviṁchiri