Title (Indic)ఇప్పుడే విచారించుకో యింతయు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇప్పుడే విచారించుకో యింతయు నీవు అప్పుడు నాతో నౌఁగా దనరాదు నీకు (॥ఇప్పు॥) యిందరివలెనే నీవిప్పటికిఁ గూడి నన్ను సందడిఁ బెట్టేనంటే సమ్మతించ రా పందెమాడినట్లనే పదియుఁ బదియుగా, నా- కందువనే వుండవలె కలకాలము (॥ఇప్పు॥) తక్కులుఁ దెక్కులు నాడి తగులఁ దీసుక నా- యిక్కువలంట(టే?) నంటే వియ్యకొన రా వొక్కటినొక్కటి నా వొడఁబాటు నాకంటే మక్కువ నితరులను మన్నించరాదు (॥ఇప్పు॥) యీయెడనే శ్రీవేంకటేశ నాకు దక్కితివి నీయింతులు వరుసంటే నే నియ్యరా యేయెడ బలుకుబంత మేకముగ నా కాగిట రేయుఁబగలు బాయక రిచ్చవడవలెనా(రా?) English(||pallavi||) ippuḍe visāriṁchugo yiṁtayu nīvu appuḍu nādo naum̐gā danarādu nīgu (||ippu||) yiṁdarivalĕne nīvippaḍigim̐ gūḍi nannu saṁdaḍim̐ bĕṭṭenaṁṭe sammadiṁcha rā paṁdĕmāḍinaṭlane padiyum̐ badiyugā, nā- kaṁduvane vuṁḍavalĕ kalagālamu (||ippu||) takkulum̐ dĕkkulu nāḍi tagulam̐ dīsuga nā- yikkuvalaṁṭa(ṭe?) naṁṭe viyyagŏna rā vŏkkaḍinŏkkaḍi nā vŏḍam̐bāḍu nāgaṁṭe makkuva nidarulanu manniṁcharādu (||ippu||) yīyĕḍane śhrīveṁkaḍeśha nāgu dakkidivi nīyiṁtulu varusaṁṭe ne niyyarā yeyĕḍa balugubaṁta megamuga nā kāgiḍa reyum̐bagalu bāyaga richchavaḍavalĕnā(rā?)