Title (Indic)ఇప్పు డెరిఁగితి నేను యీపె నీకుఁ బ్రియమౌత WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇప్పు డెరిఁగితి నేను యీపె నీకుఁ బ్రియమౌత ముప్పిరి నన్నేలితివి మొక్కే నే నీపెకు (॥ఇప్పు॥) నిక్కి నిక్కి యాపె నేఁడు నీ మొగమే చూచీని చొక్కముగ నెటువంటిచుట్టమో నీకు నెక్కొని సారె సారెకు నీతోనే మాఁటలాడీ యిక్కు వతోడుత నీపై నెంతబత్తో తనకు (॥ఇప్పు॥) వద్దికి వచ్చి నీతో వడిగా నవ్వులు నవ్వీ యిద్దరికి మీలో సన్న లెటువంటివో కొద్దిమీరి చెక్కునొక్కి కొచ్చికొచ్చి వేఁడుకొనీ ముద్దు ముద్దువలె నెంతముచ్చటో తనకు (॥ఇప్పు॥) మోవితేనె లూరనూర ముంచి వుపారము చూపీ వేవేలుగా నవి యెంత వేడుకో నీకు యావేళ శ్రీవేంకటేశ యాకె యలమేలుమంగ దేవులాయ నీకు నెంతతేజమో తనకు English(||pallavi||) ippu ḍĕrim̐gidi nenu yībĕ nīgum̐ briyamauda muppiri nannelidivi mŏkke ne nībĕgu (||ippu||) nikki nikki yābĕ nem̐ḍu nī mŏgame sūsīni sŏkkamuga nĕḍuvaṁṭisuṭṭamo nīgu nĕkkŏni sārĕ sārĕgu nīdone mām̐ṭalāḍī yikku vadoḍuda nībai nĕṁtabatto tanagu (||ippu||) vaddigi vachchi nīdo vaḍigā navvulu navvī yiddarigi mīlo sanna lĕḍuvaṁṭivo kŏddimīri sĕkkunŏkki kŏchchigŏchchi vem̐ḍugŏnī muddu mudduvalĕ nĕṁtamuchchaḍo tanagu (||ippu||) movidenĕ lūranūra muṁchi vubāramu sūbī vevelugā navi yĕṁta veḍugo nīgu yāveḽa śhrīveṁkaḍeśha yāgĕ yalamelumaṁga devulāya nīgu nĕṁtadejamo tanagu