Title (Indic)ఇన్నియుఁ దనతోఁగాక ఇఁక మరి కలదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇన్నియుఁ దనతోఁగాక ఇఁక మరి కలదా యెన్నిరాని పరవశ మెవ్వరి సొమ్మే (॥ఇన్ని॥) మాటలాడకుండితేను మాననీవే కొసరఁగ- నేఁటికే మౌనవ్రత మెవ్వరిసొమ్మే యీటులేనిమోము చూడకున్న నుండనీవే కాటుకకన్నులనీటికాలు వెవ్వరిసొమ్మే (॥ఇన్ని॥) నవ్వకుండితేఁ బోనీవే నాకు నింకాఁ దనకుఁగా- నివ్వలఁ జెక్కిటిచే యెవ్వరిసొమ్మే దవ్వుగాక వద్దనుండి తడవకున్నఁ బోనీవే చివ్వన బానుపుమీఁద సిగ్గు లెవ్వరిసొమ్మే (॥ఇన్ని॥) కూడినరతులవేళ కొంకకున్న లేలేవే యీడులేనిబుసకొట్టు లెవ్వరిసొమ్మే జోడై శ్రీవేంకటపతి చొక్కించే నౌనౌనే వీడెపుమోవిఁ జేసేటివింత లెవ్వరిసొమ్మే English(||pallavi||) inniyum̐ danadom̐gāga im̐ka mari kaladā yĕnnirāni paravaśha mĕvvari sŏmme (||inni||) māḍalāḍaguṁḍidenu mānanīve kŏsaram̐ga- nem̐ṭige maunavrada mĕvvarisŏmme yīḍulenimomu sūḍagunna nuṁḍanīve kāḍugagannulanīḍigālu vĕvvarisŏmme (||inni||) navvaguṁḍidem̐ bonīve nāgu niṁkām̐ danagum̐gā- nivvalam̐ jĕkkiḍise yĕvvarisŏmme davvugāga vaddanuṁḍi taḍavagunnam̐ bonīve sivvana bānubumīm̐da siggu lĕvvarisŏmme (||inni||) kūḍinaradulaveḽa kŏṁkagunna leleve yīḍulenibusagŏṭṭu lĕvvarisŏmme joḍai śhrīveṁkaḍabadi sŏkkiṁche naunaune vīḍĕbumovim̐ jeseḍiviṁta lĕvvarisŏmme