Title (Indic)ఇంతులెల్లా విని యింక నేమందురు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతులెల్లా విని యింక నేమందురు కాంతుఁడవు ఇటువంటి కాకు గలదా (॥ఇంతు॥) అగ్గమై నీవు నా వొద్ద నాపెచన్నులంటఁగాను సిగ్గువడి వున్నదాన చెక్కుచేతితో యెగ్గెరఁగకొక్కపారే యిద్దరిఁ గూడవచ్చేవు కగ్గుదేర నిటువంటి కాకుగలదా (॥ఇంతు॥) పొరి నేఁ జూడఁగా నాపె పోఁకముడి జారించఁగా శిరసు వంచుకుందాన చెక్కుచేతితో సరుస సిబ్బితి లేక జంట రతి సేసేవు గరిమెల నిటువంటి కాకు గలదా (॥ఇంతు॥) వుమ్మడి నాకె నీవు నావొద్దనే కూడఁగాను చిమ్మిరేఁగి వున్నదాన చెక్కుచేతితో యెమ్మెతో శ్రీవేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి కమ్మరఁ గమ్మర నింత కాకు గలదా English(||pallavi||) iṁtulĕllā vini yiṁka nemaṁduru kāṁtum̐ḍavu iḍuvaṁṭi kāgu galadā (||iṁtu||) aggamai nīvu nā vŏdda nābĕsannulaṁṭam̐gānu sigguvaḍi vunnadāna sĕkkusedido yĕggĕram̐gagŏkkabāre yiddarim̐ gūḍavachchevu kaggudera niḍuvaṁṭi kāgugaladā (||iṁtu||) pŏri nem̐ jūḍam̐gā nābĕ pom̐kamuḍi jāriṁcham̐gā śhirasu vaṁchuguṁdāna sĕkkusedido sarusa sibbidi lega jaṁṭa radi sesevu garimĕla niḍuvaṁṭi kāgu galadā (||iṁtu||) vummaḍi nāgĕ nīvu nāvŏddane kūḍam̐gānu simmirem̐gi vunnadāna sĕkkusedido yĕmmĕdo śhrīveṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi kammaram̐ gammara niṁta kāgu galadā