Title (Indic)ఇంతులాల చూడరమ్మ యెన్నఁ గొ త్తలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతులాల చూడరమ్మ యెన్నఁ గొ త్తలు సంతతము నీపె జవ్వన వనమందు (॥॥) చెలియమోవినే సింగారము చిగిరించె అలకల ననలుఁ గొనలు సాగెను మలసి కరములను మారాకులు వెట్టె వలపల యీపె జవ్వనవనమందును (॥॥) మచ్చికతోడుత మంచిమాటలనే నీడలొ త్తె పెచ్చు రేఁగి చన్నులను పిందెలు వుట్టె విచ్చనవిడి నవ్వుల వెన్నెలపంటలు వండె వచ్చె నామని యీపెజవ్వనవనమందును (॥॥) పిఱిఁదిచక్కఁ దనము పెద్ద పెద్దరాసులాయ కొఱగలతొడలే కొమ్మలాయను చిఱుఁ జెమటలతోడ శ్రీ వేంకటేశుడు గూడి వఱలుచు మించె నీజవ్వనవనమందును English(||pallavi||) iṁtulāla sūḍaramma yĕnnam̐ gŏ ttalu saṁtadamu nībĕ javvana vanamaṁdu (||||) sĕliyamovine siṁgāramu sigiriṁchĕ alagala nanalum̐ gŏnalu sāgĕnu malasi karamulanu mārāgulu vĕṭṭĕ valabala yībĕ javvanavanamaṁdunu (||||) machchigadoḍuda maṁchimāḍalane nīḍalŏ ttĕ pĕchchu rem̐gi sannulanu piṁdĕlu vuṭṭĕ vichchanaviḍi navvula vĕnnĕlabaṁṭalu vaṁḍĕ vachchĕ nāmani yībĕjavvanavanamaṁdunu (||||) piṟim̐disakkam̐ danamu pĕdda pĕddarāsulāya kŏṟagaladŏḍale kŏmmalāyanu siṟum̐ jĕmaḍaladoḍa śhrī veṁkaḍeśhuḍu gūḍi vaṟalusu miṁchĕ nījavvanavanamaṁdunu