Title (Indic)ఇంతులాల మాపు దాఁకా నేమిచెప్పేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతులాల మాపు దాఁకా నేమిచెప్పేను అంతరంగాన నున్నాఁడు అన్నియు దా నెఱుఁగును (॥ఇంతు॥) యెనసివుండుదుఁగాని యెరవులు సేయనేర పెనఁగి పైకొందుఁగాని బిగియనేర ననుపే చూపుదుఁగాని నమ్మక సొదించనేర- నని విన్నవించరే అన్నియుఁ దా నెఱుఁగు (॥ఇంతు॥) చేరి చెలఁగుదుఁగాని చిన్నఁబోయేయందుకోప సారె మోముచూతుఁగాని జంకించనోప కూరిమి చల్లుదుఁగాని కోపగించుకొననోప అరీతి విన్నవించరే యన్నియుఁ దానెఱుఁగు (॥ఇంతు॥) సిగ్గులువడుదుఁగాని చిట్టకము సేయఁజాల వొగ్గి వేడుఁకొందుఁగాని వొరయఁజాల యెగ్గులేక తానే వచ్చియేలె శ్రీవేంకటేశుఁడు అగ్గమై విన్నవించరే యన్నియుఁ దానెఱుఁగు English(||pallavi||) iṁtulāla mābu dām̐kā nemisĕppenu aṁtaraṁgāna nunnām̐ḍu anniyu dā nĕṟum̐gunu (||iṁtu||) yĕnasivuṁḍudum̐gāni yĕravulu seyanera pĕnam̐gi paigŏṁdum̐gāni bigiyanera nanube sūbudum̐gāni nammaga sŏdiṁchanera- nani vinnaviṁchare anniyum̐ dā nĕṟum̐gu (||iṁtu||) seri sĕlam̐gudum̐gāni sinnam̐boyeyaṁdugoba sārĕ momusūdum̐gāni jaṁkiṁchanoba kūrimi salludum̐gāni kobagiṁchugŏnanoba arīdi vinnaviṁchare yanniyum̐ dānĕṟum̐gu (||iṁtu||) sigguluvaḍudum̐gāni siṭṭagamu seyam̐jāla vŏggi veḍum̐kŏṁdum̐gāni vŏrayam̐jāla yĕggulega tāne vachchiyelĕ śhrīveṁkaḍeśhum̐ḍu aggamai vinnaviṁchare yanniyum̐ dānĕṟum̐gu