Title (Indic)ఇంతిరో నీ వున్నభావ మెట్టు చూతునే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతిరో నీ వున్నభావ మెట్టు చూతునే పంతపు నీ తప సింక పండు టెన్నఁడే (॥ఇంతిరో॥) చెలిమీఁద నొరగుండి చెక్కుమీఁదఁ జేయివెట్టి వలపువేదన నేల వసివాడవే యెలమిఁ జెఱకువిల్లు యెక్కువెట్టి యేయఁ జొచ్చే వలరాచపగ యెటువలె నీఁగెనె (॥ఇంతిరో॥) తమ్మిమోము గడు వంచి తత్తరాలే పచరించి వుమ్మచెమటల నేల వుస్సు రనేవే దిమ్ముల యాసలు రేఁచి తేనెలు మోవి నూరించె యెమ్మెల జవ్వనభార మెట్టు మోచేవే (॥ఇంతిరో॥) పొంది కలువల పోసి భోగించేపానుపు చూచి యిందరిలో నీకు నీకే యేల వుబ్బేవే బెంది యలమేలుమంగ శ్రీవేంకటేశుఁ గూడితి విందు నీ కళలసాంపు లెందు దాఁచేవే English(||pallavi||) iṁtiro nī vunnabhāva mĕṭṭu sūdune paṁtabu nī taba siṁka paṁḍu ṭĕnnam̐ḍe (||iṁtiro||) sĕlimīm̐da nŏraguṁḍi sĕkkumīm̐dam̐ jeyivĕṭṭi valabuvedana nela vasivāḍave yĕlamim̐ jĕṟaguvillu yĕkkuvĕṭṭi yeyam̐ jŏchche valarāsabaga yĕḍuvalĕ nīm̐gĕnĕ (||iṁtiro||) tammimomu gaḍu vaṁchi tattarāle pasariṁchi vummasĕmaḍala nela vussu raneve dimmula yāsalu rem̐si tenĕlu movi nūriṁchĕ yĕmmĕla javvanabhāra mĕṭṭu moseve (||iṁtiro||) pŏṁdi kaluvala posi bhogiṁchebānubu sūsi yiṁdarilo nīgu nīge yela vubbeve bĕṁdi yalamelumaṁga śhrīveṁkaḍeśhum̐ gūḍidi viṁdu nī kaḽalasāṁpu lĕṁdu dām̐seve