Title (Indic)ఇంతిభాగ్యము నీచిత్త మేము చెలికత్తెలము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతిభాగ్యము నీచిత్త మేము చెలికత్తెలము యెంతసేసునో వలపేమౌతా నెఱఁగము (॥ఇంతి॥) కోరి నిన్ను సారెసారెఁ గూరిమి గొసరఁగాను యేరీతి నున్నదో చిత్త మెఱఁగము చేరి నీకుఁ గానుకిచ్చి చేతులెత్తి మొక్కఁగాను బొరన నీకును దయ పుట్టునో యెఱఁగము (॥ఇంతి॥) బెట్టుగా నింతేసి నీకుఁ బ్రియములు చెప్పఁగాను యెట్టు సేసేవో నీచేత లెఱఁగము చుట్టిచుట్టి నిన్ను నింత సొలసి వేగిరించఁగా గుట్టున నెప్పుడు వచ్చి కూడేవొ యెఱఁగము (॥ఇంతి॥) పిలిచితెచ్చి నిన్నీకె పెండ్లిపీఁట నుంచఁగా ఇల నెంతమన్నించేవో యెఱఁగము చెలి యలమేలుమంగ శ్రీవేంకటేశుఁడవు కలిసితివి నేరుపుగలుగు టెఱఁగము English(||pallavi||) iṁtibhāgyamu nīsitta memu sĕligattĕlamu yĕṁtasesuno valabemaudā nĕṟam̐gamu (||iṁti||) kori ninnu sārĕsārĕm̐ gūrimi gŏsaram̐gānu yerīdi nunnado sitta mĕṟam̐gamu seri nīgum̐ gānugichchi sedulĕtti mŏkkam̐gānu bŏrana nīgunu daya puṭṭuno yĕṟam̐gamu (||iṁti||) bĕṭṭugā niṁtesi nīgum̐ briyamulu sĕppam̐gānu yĕṭṭu sesevo nīseda lĕṟam̐gamu suṭṭisuṭṭi ninnu niṁta sŏlasi vegiriṁcham̐gā guṭṭuna nĕppuḍu vachchi kūḍevŏ yĕṟam̐gamu (||iṁti||) pilisidĕchchi ninnīgĕ pĕṁḍlibīm̐ṭa nuṁcham̐gā ila nĕṁtamanniṁchevo yĕṟam̐gamu sĕli yalamelumaṁga śhrīveṁkaḍeśhum̐ḍavu kalisidivi nerubugalugu ṭĕṟam̐gamu