Title (Indic)ఇంతవేడుక గలితే నింటికి విచ్చేయరాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతవేడుక గలితే నింటికి విచ్చేయరాదా చెంత నీవు చెప్పినట్టు సేవ సేసేఁగాని (॥ఇంత॥) సిగ్గులే చీఁదరగొంటే చెలి ఇఁక నేమిసేసు వొగ్గి కతచెప్పుమని వొడివట్టేవు వెగ్గళపు వలపులవెల్లి యెట్టు యీఁదవచ్చు అగ్గువకోరికలకు నాసపడేవు (॥ఇంత॥) నవ్వులే చిమ్మిరేఁచితే నలినాక్షి యేమిసేసు చివ్వన మాఁటాడుమని చెక్కునొక్కేవు వువ్వీళ్లూరే మోవితేనె వుట్టిఁగట్ట నెట్టు వచ్చు పువ్వువంటి తమకము పోదిసే సేవు (॥ఇంత॥) పాయమే కారుకమ్మితే పడఁతిఁ దా నేమి సేసు కాయజకేలి యిమ్మని కాఁగిలించేవు యీయెడ శ్రీ వేంకటేశ యేలితి వలమేల్మంగను చాయల నీచేఁత లిన్నీఁ జవులు సే సేవు English(||pallavi||) iṁtaveḍuga galide niṁṭigi vichcheyarādā sĕṁta nīvu sĕppinaṭṭu seva sesem̐gāni (||iṁta||) siggule sīm̐daragŏṁṭe sĕli im̐ka nemisesu vŏggi kadasĕppumani vŏḍivaṭṭevu vĕggaḽabu valabulavĕlli yĕṭṭu yīm̐davachchu agguvagorigalagu nāsabaḍevu (||iṁta||) navvule simmirem̐side nalinākṣhi yemisesu sivvana mām̐ṭāḍumani sĕkkunŏkkevu vuvvīḽlūre movidenĕ vuṭṭim̐gaṭṭa nĕṭṭu vachchu puvvuvaṁṭi tamagamu podise sevu (||iṁta||) pāyame kārugammide paḍam̐tim̐ dā nemi sesu kāyajageli yimmani kām̐giliṁchevu yīyĕḍa śhrī veṁkaḍeśha yelidi valamelmaṁganu sāyala nīsem̐ta linnīm̐ javulu se sevu