Title (Indic)ఇంతకంటె నెవ్వరికి నెచ్చరాదు కుందరాదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతకంటె నెవ్వరికి నెచ్చరాదు కుందరాదు వంతలఁ దగరై తాఁకవచ్చునటవయ్యా (॥ఇంత॥) వోఁగునూతులౌభళేశ వొద్దికి నీచెలి డాసె సాగినసభలలోన చలివాసె రేఁగినకోపము మాసె రేయే పగలు సేసె చేఁగల నీకేమి సేసు చెప్పఁగదవయ్యా (॥ఇంత॥) నారసింహ కాలుఁదొక్కె నాతి నీకుఁ జేత మొక్కె గారవపుమోహము అఁగన చొక్కె సారెకు నీచెక్కునొక్కె జారినకురులు చెక్కె చేరి యేమిసేసు నిఁక చెప్పఁగదవయ్యా (॥ఇంత॥) శ్రీవేంకటేవ ముఁదె శ్రీసతి నీకాఁగి లొందె భావజురతులలోన ఫల మందె పూవులలోనిపిందె పొడమినట్టు పొందె సేవ లింక నేమిసేసుఁ జెప్పఁగదవయ్యా English(||pallavi||) iṁtagaṁṭĕ nĕvvarigi nĕchcharādu kuṁdarādu vaṁtalam̐ dagarai tām̐kavachchunaḍavayyā (||iṁta||) vom̐gunūdulaubhaḽeśha vŏddigi nīsĕli ḍāsĕ sāginasabhalalona salivāsĕ rem̐ginagobamu māsĕ reye pagalu sesĕ sem̐gala nīgemi sesu sĕppam̐gadavayyā (||iṁta||) nārasiṁha kālum̐dŏkkĕ nādi nīgum̐ jeda mŏkkĕ gāravabumohamu am̐gana sŏkkĕ sārĕgu nīsĕkkunŏkkĕ jārinagurulu sĕkkĕ seri yemisesu nim̐ka sĕppam̐gadavayyā (||iṁta||) śhrīveṁkaḍeva mum̐dĕ śhrīsadi nīgām̐gi lŏṁdĕ bhāvajuradulalona phala maṁdĕ pūvulalonibiṁdĕ pŏḍaminaṭṭu pŏṁdĕ seva liṁka nemisesum̐ jĕppam̐gadavayyā