Title (Indic)ఇంత సేయఁగఁగదా యీడ వెల వెట్టితివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంత సేయఁగఁగదా యీడ వెల వెట్టితివి కాంతుఁడవు నీవు మాణిక్యమువంటివాఁడవు (॥ఇంత॥) మచ్చరించఁగఁ గదా మనసు పట్టఁ దిరిగే విచ్చకములాడుకంటె యిదె మేలు కచ్చుపెట్టి బంగారము కరఁగక వన్నెలేదు అచ్చముగ వోరి నీవు అటువంటివాఁడవు (॥ఇంత॥) రాకుండఁగ నీవే నన్ను రతికిఁ బిలిచితివి యేకమై వుండుటకంటె యిదె మేలు మేకొని కస్తూరైనా మేదించక యెనయదు ఆకడ నీవు వోరి అటువంటివాఁడవు (॥ఇంత॥) గుట్టుననుండఁగఁ గదా కూడితి శ్రీ వేంకటేశ యిట్టునట్టు దూరుకంటె యిదె మేలు చెట్టుమీఁది విరులైనా చేతులఁ గోయకరావు అట్టెవోరి నీవు అటువంటివాఁడవు English(||pallavi||) iṁta seyam̐gam̐gadā yīḍa vĕla vĕṭṭidivi kāṁtum̐ḍavu nīvu māṇikyamuvaṁṭivām̐ḍavu (||iṁta||) machchariṁcham̐gam̐ gadā manasu paṭṭam̐ dirige vichchagamulāḍugaṁṭĕ yidĕ melu kachchubĕṭṭi baṁgāramu karam̐gaga vannĕledu achchamuga vori nīvu aḍuvaṁṭivām̐ḍavu (||iṁta||) rāguṁḍam̐ga nīve nannu radigim̐ bilisidivi yegamai vuṁḍuḍagaṁṭĕ yidĕ melu megŏni kastūrainā mediṁchaga yĕnayadu āgaḍa nīvu vori aḍuvaṁṭivām̐ḍavu (||iṁta||) guṭṭunanuṁḍam̐gam̐ gadā kūḍidi śhrī veṁkaḍeśha yiṭṭunaṭṭu dūrugaṁṭĕ yidĕ melu sĕṭṭumīm̐di virulainā sedulam̐ goyagarāvu aṭṭĕvori nīvu aḍuvaṁṭivām̐ḍavu