Title (Indic)ఇంకా నెవ్వరూ వినరు యేఁటికి సిగ్గువడేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంకా నెవ్వరూ వినరు యేఁటికి సిగ్గువడేవు పంకించ కిందరి నొడఁబరచే నే నిపుడు (॥ఇంకా॥) ముంచె మైఁ జెమటవాన మోవి నదె తేనె సోన మంచముపైఁ బెనఁగితే మగువకును వంచకు నీవు మోము వద్దనేమా నిన్ను నేము ఇంచు కించుకే నీ సుద్దు లెరిఁగితి మిపుడు (॥ఇంకా॥) కరఁగెఁ గస్తూరి పూఁత కలిగె నూర్పులమోత సొరిది నీతో నుండఁగా సుదతికిని వెరవు గలవు నీవు వెస నిది నాకు లావు పరిపాటి నీ చేఁతలు బయలాయ నిపుడు (॥ఇంకా॥) హెచ్చెఁ గాఁగిటిరతులు ఎరవాయ సంగతులు వచ్చి నిన్నుఁ గూడఁగాను వనితకును ఇచ్చల శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు మచ్చికతో నీ పొందులు మరిగితి మిపుడు English(||pallavi||) iṁkā nĕvvarū vinaru yem̐ṭigi sigguvaḍevu paṁkiṁcha kiṁdari nŏḍam̐barase ne nibuḍu (||iṁkā||) muṁchĕ maim̐ jĕmaḍavāna movi nadĕ tenĕ sona maṁchamubaim̐ bĕnam̐gide maguvagunu vaṁchagu nīvu momu vaddanemā ninnu nemu iṁchu kiṁchuge nī suddu lĕrim̐gidi mibuḍu (||iṁkā||) karam̐gĕm̐ gastūri pūm̐ta kaligĕ nūrbulamoda sŏridi nīdo nuṁḍam̐gā sudadigini vĕravu galavu nīvu vĕsa nidi nāgu lāvu paribāḍi nī sem̐talu bayalāya nibuḍu (||iṁkā||) hĕchchĕm̐ gām̐giḍiradulu ĕravāya saṁgadulu vachchi ninnum̐ gūḍam̐gānu vanidagunu ichchala śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu machchigado nī pŏṁdulu marigidi mibuḍu