Title (Indic)ఇంకా నప్పటి నీతో నెదురాడేనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంకా నప్పటి నీతో నెదురాడేనా మంకుదానఁ గాను నిన్నే మరిగితి నేను (॥ఇంకా॥) చింతలెల్ల బెడఁ బాసె చెక్కు నీవు నొక్కఁగాను యింత ప్రియము చెప్ప నే నేమి బాఁతి యింతులచే మొక్కించి యేల దోసాలు గట్టేవు చెంతల నేమి చెప్పిన సేసేనయ్య నీకు (॥ఇంకా॥) కోపమెల్లాఁ జల్లనాయ కొప్పు నీవు ముడువఁగా యేపనులు సేసేవు నే నేమి బాఁతి యీపొద్దు యింటికి వచ్చి యేల రవ్వలు సేసేవు కోపుల నీమాట లియ్యకొంటినయ్య యిపుడే (॥ఇంకా॥) కాయమెల్లాఁ బులకించెఁ గాఁగిట నీవు గూడఁగ- నీయెడ నిందరిలో నే నేమి బాఁతి యీయరానిబాస లిచ్చి యేల మోపు గట్టేవు నాయపు శ్రీవేంకటేశ నమ్మేనయ్య నిన్ను English(||pallavi||) iṁkā nappaḍi nīdo nĕdurāḍenā maṁkudānam̐ gānu ninne marigidi nenu (||iṁkā||) siṁtalĕlla bĕḍam̐ bāsĕ sĕkku nīvu nŏkkam̐gānu yiṁta priyamu sĕppa ne nemi bām̐ti yiṁtulase mŏkkiṁchi yela dosālu gaṭṭevu sĕṁtala nemi sĕppina sesenayya nīgu (||iṁkā||) kobamĕllām̐ jallanāya kŏppu nīvu muḍuvam̐gā yebanulu sesevu ne nemi bām̐ti yībŏddu yiṁṭigi vachchi yela ravvalu sesevu kobula nīmāḍa liyyagŏṁṭinayya yibuḍe (||iṁkā||) kāyamĕllām̐ bulagiṁchĕm̐ gām̐giḍa nīvu gūḍam̐ga- nīyĕḍa niṁdarilo ne nemi bām̐ti yīyarānibāsa lichchi yela mobu gaṭṭevu nāyabu śhrīveṁkaḍeśha nammenayya ninnu