Title (Indic)ఇందుకొరకె యిందరును నిట్లయిరి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇందుకొరకె యిందరును నిట్లయిరి కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు (॥ఇందు॥) అటమటపువేడుకల నలయించి మఱికదా ఘటియించుఁ బరము తటుకన దైవము ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు. కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు (॥ఇందు॥) బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా కొండనుచుఁ బర మొసంగును దైవము బండుసేయఁగ హరికి బంతమా? యటుగాదు. యెండదాఁకక నీడహిత వెఱఁగరాదు (॥ఇందు॥) మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా తనభ క్తి యొసఁగు నంతట దైవము ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు. తినక చేఁదునుఁ దీపు తెలియనేరాదు. English(||pallavi||) iṁdugŏragĕ yiṁdarunu niṭlayiri kiṁdubaḍi maṟigāni gĕlubĕṟam̐garādu (||iṁdu||) aḍamaḍabuveḍugala nalayiṁchi maṟigadā ghaḍiyiṁchum̐ baramu taḍugana daivamu iḍu seya nīśhvaruna kīsu galadā? ledu. kuḍilamadim̐ gani kāni guṇim̐ gānarādu (||iṁdu||) bĕṁḍubaḍa navagadulam̐ bĕnam̐giṁchi maṟigadā kŏṁḍanusum̐ bara mŏsaṁgunu daivamu baṁḍuseyam̐ga harigi baṁtamā? yaḍugādu. yĕṁḍadām̐kaga nīḍahida vĕṟam̐garādu (||iṁdu||) munuba velbulagĕlla mrŏkkiṁchi maṟigadā tanabha kti yŏsam̐gu naṁtaḍa daivamu ghanaveṁkaḍeśhunagu gabaḍamā? aḍugādu. tinaga sem̐dunum̐ dību tĕliyanerādu.