Title (Indic)ఇందరముఁ బైకొంటే నేమిసేసేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇందరముఁ బైకొంటే నేమిసేసేవు చెంది నీకిప్పుడే చాటిచెప్పితిఁ జుమీ (॥ఇంద॥) చీరలియ్యఁగదవోయి సిగ్గరిగొల్లెతలము చేరి మమ్మునేల కాకుసేసేవోయి బారెఁడేసినెరులివె పైఁ గప్పుకున్నారము కేరికేరి యంత కిలకిల నవ్వేవోయి (॥ఇంద॥) చేతులెత్తి మొక్కుమని చెప్పేవు పలుమారు కాతరీఁడ వౌదువు దగ్గర రావోయి జౌతిగాఁ దమ్మిపువ్వులఁ జాటువెట్టుకున్నారము యేతరిచేఁతలు మాతోనేల సేసేవోయి (॥ఇంద॥) వలపులు చల్లేవు వడి మాపై సేసలుగా కలసి చీర లిచ్చితి గామిడివోయి అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర ఫలించే మానోము నీవే పతివయితివోయి English(||pallavi||) iṁdaramum̐ baigŏṁṭe nemisesevu sĕṁdi nīgippuḍe sāḍisĕppidim̐ jumī (||iṁda||) sīraliyyam̐gadavoyi siggarigŏllĕdalamu seri mammunela kāgusesevoyi bārĕm̐ḍesinĕrulivĕ paim̐ gappugunnāramu kerigeri yaṁta kilagila navvevoyi (||iṁda||) sedulĕtti mŏkkumani sĕppevu palumāru kādarīm̐ḍa vauduvu daggara rāvoyi jaudigām̐ dammibuvvulam̐ jāḍuvĕṭṭugunnāramu yedarisem̐talu mādonela sesevoyi (||iṁda||) valabulu sallevu vaḍi mābai sesalugā kalasi sīra lichchidi gāmiḍivoyi alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara phaliṁche mānomu nīve padivayidivoyi