Title (Indic)ఇహముఁ బరముఁ జిక్కె నీతని వంక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇహముఁ బరముఁ జిక్కె నీతని వంక అహిశయనుని దాసులంతవారు వేరీ (॥ఇహ॥) సిరి కలిగినవారు చింతలిన్నిటనుఁ బాసి నిరతపు వర్గ(గర్వ?)ముతో నిక్కేరటా సిరికి మగఁడయిన శ్రీపతి యేలి మ- మ్మరయుచునున్నాఁడు మా యంతవారు వేరీ (॥ఇహ॥) బలవంతుఁడైనవాఁడు భయము లిన్నిటఁ బాసి గెలిచి పేరు వాడుచుఁ గెరలీనటా బలదేవుఁడైన శ్రీపతి మా యింటిలోన అలరి వున్నాఁడు మా యంతవారు వేరీ (॥ఇహ॥) భూము లేలేటివాఁడు భోగములతోఁ దనిసి కామించి యానందమునఁ గరఁగీనటా సేమముతో భూపతైన శ్రీవేంకటేశుఁడు మాకు ఆముకొనివుండఁగా మాయంతవారు వేరీ English(||pallavi||) ihamum̐ baramum̐ jikkĕ nīdani vaṁka ahiśhayanuni dāsulaṁtavāru verī (||iha||) siri kaliginavāru siṁtalinniḍanum̐ bāsi niradabu varga(garva?)mudo nikkeraḍā sirigi magam̐ḍayina śhrībadi yeli ma- mmarayusununnām̐ḍu mā yaṁtavāru verī (||iha||) balavaṁtum̐ḍainavām̐ḍu bhayamu linniḍam̐ bāsi gĕlisi peru vāḍusum̐ gĕralīnaḍā baladevum̐ḍaina śhrībadi mā yiṁṭilona alari vunnām̐ḍu mā yaṁtavāru verī (||iha||) bhūmu leleḍivām̐ḍu bhogamuladom̐ danisi kāmiṁchi yānaṁdamunam̐ garam̐gīnaḍā semamudo bhūbadaina śhrīveṁkaḍeśhum̐ḍu māgu āmugŏnivuṁḍam̐gā māyaṁtavāru verī